యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)... తను చేసే షోలలో ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ఫైర్ మీద ఉంటుంది. ఆమె ఫైర్‌ని ఎంతో మంది నెటిజన్లు ఫేస్ చేశారు. మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ అభిమానులకు అయితే... అనసూయ పేరు కనబడితే చాలు మరీ మరీ కామెంట్స్ చేసేస్తుంటారు. అనసూయ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ ఇప్పటిది కాదు.. ‘అర్జున్ రెడ్డి’ టైమ్ నుండి నడుస్తూనే ఉంది. విజయ్ దేవరకొండపై తనకు ఎటువంటి కోపం లేదని చెబుతూనే ఉంటుంది. కానీ ఏదో ఒక పంచ్ పేలుస్తూనే ఉంటుంది అనసూయ. అయితే ఇందులో విజయ్ దేవరకొండ ప్రమేయం ఎంత ఉందనేది తెలియదు కానీ... ఆయన ఫ్యాన్స్ మాత్రం కావాలని మరీ అనసూయని ‘ఆంటీ’ అంటూ రెచ్చగొడుతుంటారు. ఆ పదం వింటే చాలు అనసూయ కూడా విజయ్ ఫ్యాన్స్‌పై భగ్గుమంటుంది. సరే, ఇదంతా ఎందుకూ అంటే.. తాజాగా అనసూయ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతూ.. రకరకాల ఊహాగానాలకు కారణం అవుతుంది.
‘దూరపు కొండలు నునుపు’.. అనసూయ చేసిన పోస్ట్ ఇదే. అయితే ఈ పోస్ట్ వెనుక మర్మం ఏమిటనేది అస్సలు తెలియకుండా ఉంది. సోమవారం రాత్రి రష్మికతో కలిసి అనసూయ కూడా ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొంది. బ్లాక్ శారీలో అనసూయ అందరినీ అలరించింది. రష్మికతో కూడా ఈ వేడుకలో బాగానే మాట్లాడినట్లుగా కనిపించింది. మరి ఏమయిందో ఏమో.. ఈవెంట్ అయిన మరుసటి రోజే.. ఆమె ఈ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ గమనిస్తే.. ఇందులో ‘కొండ’ అనే పదం కూడా ఉంది. అంటే ఇది కచ్చితంగా విజయ్ దేవర‘కొండ’ని ఉద్దేశించి అని మాత్రం అర్థం చేసుకోవచ్చని కొందరు నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.
Also Read: పుష్ప 2 సెన్సార్ బోర్డు రివ్యూ... అల్లు అర్జున్ సినిమాలో హైలైట్స్ ఏంటో తెలుసా?
ఈ మధ్య రష్మిక తను రిలేషన్ షిప్‌లో ఉన్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎవరితో ఉందనేది ఆమె ప్రకటించలేదు కానీ.. తరుచూ విజయ్ దేవరకొండతో కలిసి ఆమె కనిపించడం పాటు.., రీసెంట్‌గా వారిద్దరూ ఎదురెదురుగా కూర్చుని లంచ్ చేస్తున్న ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం దేవరకొండ, రష్మికల మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తున్నట్లుగా గట్టిగానే టాక్ వినబడుతోంది. రష్మిక రిలేషన్‌ను ఉద్దేశించే అనసూయ ఇలా పోస్ట్ చేసి ఉంటుందా? అసలీ సామెతకు అర్థం దూరం నుంచి చూస్తే కొండలు చాలా నునుపుగా ఉన్నట్లుగా కనిపిస్తాయి. కానీ దగ్గరకు వెళ్లి చూస్తే.. దట్టమైన చెట్లు కనిపిస్తాయని అర్థం. అలాగే కన్నడలో పెళ్లి చేసుకోవాల్సిన రష్మిక.. అక్కడ కాదు అనుకుని వచ్చి మరీ విజయ్ దేవరకొండతో రిలేషన్ చేస్తుందనే అర్థం వచ్చేలా ఆమె పోస్ట్ ఉందని నెటిజన్లు ఈ పోస్ట్‌కు కామెంట్ చేస్తున్నారు. చూస్తుంటే వారి కామెంట్స్ కూడా కరెక్టే అనే భావన కలుగుతుంది కానీ.. అసలు మర్మం ఏమిటనేది ఆ అనసూయకే తెలియాలి.
ప్రస్తుతం అనసూయ బుల్లితెరపై షో స్ చేస్తూనే.. సినిమాలలోనూ వరస అవకాశాలను చేజిక్కించుకుంటోంది. ‘పుష్ప 2’లో దాక్షాయణిగా మరోసారి తన నటనతో అనసూయ షాకివ్వబోతోంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా (ఏ సినిమా అనేది చెప్పలేదు)లోనూ తను నటిస్తున్నట్లుగా ఇటీవల అనసూయే రివీల్ చేసింది.
Also Read: 'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?