Ananya Telugu Movie First Look Released By Hero Srikanth: అనన్య పేరుతో తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతానికి ఇద్దరు కథానాయికలు ఉన్నారు. 'మల్లేశం', 'వకీల్ సాబ్' ఫేమ్ అనన్య నాగళ్ళ ఒకరు అయితే... '30 వెడ్స్ 21' ఫేమ్ అనన్య శర్మ మరొకరు. ఇప్పుడీ 'అనన్య' ప్రస్తావన ఎందుకంటే? ఆ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది.


మార్చి 22న థియేటర్లలో 'అనన్య'
'అనన్య' సినిమాలో జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ ప్రధాన తారాగణం. ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇదొక హారర్ సినిమా. అయితే... ఫ్యామిలీ ఆడియన్స్ అందర్నీ ఆకట్టుకునే అంశాలు ఉంటాయని దర్శక నిర్మాతలు చెప్పారు.


'అనన్య' సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, ఈ నెల 22న థియేటర్లలో సినిమా విడుదల కానుందని జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో 'అనన్య' ట్రైలర్ (Ananya Movie Trailer) ఫ్యామిలీ స్టార్, శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ చేత ఆవిష్కరింపజేశారు. ఆయన ఈ సినిమా ఘన విజయం సాధించాలని అభిలషించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా కచ్చితంగా అలరించి తమ శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ సంస్థకు శుభారంభం ఇస్తుందని ఆశిస్తున్నట్లు జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ తెలిపారు.


Also Readప్రభాస్ ఒక్కడి కోసమే అలా చేశారంతే - పాన్ ఇండియా ఫిల్మ్స్, 'భీమా' గురించి గోపీచంద్ ఇంటర్వ్యూ


'అనన్య' దర్శకుడు ప్రసాద్ రాజు బొమ్మిడి మాట్లాడుతూ... ''ఏలూరు, జంగారెడ్డి గూడెం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం. సెన్సార్ సభ్యుల ప్రశంసలు మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ట్రైలర్ విడుదల చేసి, ఆల్ ది బెస్ట్ చెప్పిన హీరో శ్రీకాంత్ గారికి థాంక్స్. ఆయన సపోర్ట్ మరువలేం'' అని చెప్పారు.


Also Read: అమ్మ 'రికార్డ్ బ్రేక్' కథ వినలేదు, నేను ఓకే చేశాక చెప్పా: జయసుధ కుమారుడు నిహిర్ కపూర్ ఇంటర్వ్యూ


సీతా శ్రీనివాస్, శివాని శర్మ, చక్రవర్తి, 'జబర్దస్త్' అప్పారావు, పొట్టి చిట్టి బాబు, సుజాత, 'క్రాక్' శ్రీమణి ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నృత్యాలు: బ్రదర్ ఆనంద్ - బాలు, పోరాటాలు: దేవరాజ్, సంగీతం: త్రినాథ్ మంతెన, ఛాయాగ్రహణం: ఎ.ఎస్ రత్నం, కూర్పు: నందమూరి హరి, సహ నిర్మాత: బుద్ధాల సత్యనారాయణ, సమర్పణ: శ్రీమతి జంధ్యాల రత్న మణికుమారి, నిర్మాత: జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ప్రసాద్ రాజు బొమ్మిడి.