Anand Devarakonda: ఒకే రిసార్ట్ లో విజయ్, రష్మిక - రౌడీబాయ్ తమ్ముడు ఆనంద్ దేరకొండ షాకింగ్ కామెంట్స్!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెకేషన్ కోసం ఒకే రిసార్ట్ కు వెళ్లడం పట్ల ఆనంద్ దేవరకొండ రియాక్ట్ అయ్యాడు. అందులో తప్పేం ఉందంటూ కూల్ గా సమాధానం చెప్పాడు.

Continues below advertisement

Anand Devarakonda About: Vijay-Rashmika Relationship: విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం ‘గంగం గణేశా’ మూవీ మే 31న విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశాడు. అందులో భాగంగానే ఈ మూవీలో తన ఫ్రెండ్ గా నటించిన ‘జబర్దస్త్’ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో ర్యాండమ్ టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో ఇమ్మాన్యుయేల్ అడిగిన ప్రశ్నలకు ఫన్నీగా సమాధానం చెప్పాడు.  

Continues below advertisement

ఇమ్మాన్యుయేల్ ప్రశ్నలు.. ఆనంద్ దేవరకొండ ఫన్నీసమాధానాలు

ఇమ్మాన్యుయేల్: ఆనంద్ దేవరకొండ వర్జిన్ మోజిటో ఎప్పుడైనా తాగారా?

ఆనంద్ దేవరకొండ: తాగాను.

ఇమ్మాన్యుయేల్: ఆంధ్రాలో ఎలక్షన్స్ మంచి హీట్ లో ఉన్నాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి?

ఆనంద్ దేవరకొండ: సమ్మర్ కదా హీట్ గానే ఉంటాయి.

ఇమ్మాన్యుయేల్: మీ అన్న, ఒక స్టార్ హీరోయిన్ ఒకే రిసార్ట్ కు వెళ్లినట్టు మా దగ్గర ఫోటో ఉంది.

ఆనంద్ దేవరకొండ: నా దగ్గర కూడా ఉంది. అయితే ఏంటి? అది కో ఇన్సిడెంట్.

ఇమ్మాన్యుయేల్: ఇద్దరు ఒకే రిసార్టుకు ఎలా వెళ్లారు?

ఆనంద్ దేవరకొండ: దూరం కదా ఫ్లైట్ లో వెళ్లారు.

ఇమ్మాన్యుయేల్: మీ అన్నకు, ఆ స్టార్ హీరోయిన్ కి మధ్య ఏం నడుస్తోంది?

ఆనంద్ దేవరకొండ: నెక్ట్స్ సినిమాకు స్క్రిప్ట్ డిస్కర్షన్ జరుగుతోంది.

ఇమ్మాన్యుయేల్: మీరు సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవారు?

ఆనంద్ దేవరకొండ: సినిమాలు చూసే వాడిని.

ఇమ్మాన్యుయేల్: ఆనంద్ దేవరకొండ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు?

ఆనంద్ దేవరకొండ: మంచి ముహూర్తం చూసి చేసుకుంటా.

ఇమ్మాన్యుయేల్: అమ్మాయి రెడీగా ఉందా?

ఆనంద్ దేవరకొండ: రెడీ అయ్యాకే కదా మండపంలోకి వస్తుంది.

ఇమ్మాన్యుయేల్: దేవుడిని నమ్ముతారా?

ఆనంద్ దేవరకొండ: నమ్ముతా.

ఇమ్మాన్యుయేల్: దేవుడు మీకు ప్రత్యక్షమై ఓ వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు?

ఆనంద్ దేవరకొండ: నీకు కొంచెం జుట్టు ఇవ్వమని కోరుకుంటాను.

ఇమ్మాన్యుయేల్: దయ్యాన్ని నమ్ముతారా?

ఆనంద్ దేవరకొండ: పరిచయం లేని వాళ్లను పెద్దగా నమ్మనండి.

ఇమ్మాన్యుయేల్: సినిమాల కంటే ముందు అమెరికాలో ఉన్నారు. అక్కడ ఏం చేసేవారు?

ఆనంద్ దేవరకొండ: ఇంగ్లీష్ లో మాట్లాడే వాడిని.

ఇమ్మాన్యుయేల్: ఆనంద్ దేవరకొండ మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు?

ఆనంద్ దేవరకొండ: ఏం చేయనప్పుడే కదా ఖాళీగా ఉండేది.

ఇమ్మాన్యుయేల్: ఆనంద్ దేవకొండ బయటకి వెళ్తే విజయ్ దేవరకొండ తమ్ముడు అంటున్నారు. మీ ఫీలింగ్ ఏంటి?

ఆనంద్ దేవరకొండ: నిజమే కదా! తమ్ముడిని కాబట్టి తమ్ముడు అంటున్నారు.

ఇమ్మాన్యుయేల్: ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ చేశారంట? ఎందుకు?

ఆనంద్ దేవరకొండ: అవును. నెక్ట్స్ సినిమా కోసం.

ఇమ్మాన్యుయేల్: ఆనంద్ దేవరకొండ ఇంటర్నెట్ లో ఏం సెర్చ్ చేస్తాడు?

ఆనంద్ దేవరకొండ: www.google.com సెర్చ్ చేస్తాను.

ఇమ్మాన్యుయేల్: ఎవరినైనా చూడగానే వీడు ఎర్రి పప్ప అనిపించిందా?  

ఆనంద్ దేవరకొండ: మిమ్మల్ని చూడగానే అనిపించింది.

ఇమ్మాన్యుయేల్: సినిమాలో లిప్ కిస్ మీ అన్నను చూసి పెట్టుకున్నారా?

ఆనంద్ దేవరకొండ: లేదు, హీరోయిన్ ని చూసి పెట్టుకున్నా.

ఇమ్మాన్యుయేల్: చివరగా గంగం గణేశా గురించి చెప్పండి

ఆనంద్ దేవరకొండ: ఫన్ బాగుంటుంది. ఫ్యామిలీతో వచ్చి థియేటర్ లో ఎంజాయ్ చెయ్యొచ్చు.

Also Read: పవన్ కల్యాణ్, ప్రభాస్‌లలో నాకు నచ్చేది అదే - ఆసక్తికర విషయాలు చెప్పిన ‘ఓజీ’ డైరెక్టర్ సుజీత్

Continues below advertisement