Amitabh Bachchan About Kalki 2898 AD: ఎంత ప్యాన్ ఇండియా సినిమా అయినా విడుదలయిన కొన్నిరోజులకే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది. కానీ ‘కల్కి 2898 ఏడీ’ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. జూన్ 27న విడుదలయిన ఈ సినిమాకు ఇప్పటికీ కొన్ని థియేటర్లలో హౌజ్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది. ఈ మూవీ ఇంతలాగా హిట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. నాగ్ అశ్విన్ టేకింగ్, ప్రభాస్ యాక్టింగ్‌తో పాటు ఇతర క్యాస్టింగ్ యాక్టింగ్ కూడా ఈ మూవీ సక్సెస్‌కు తోడు అయ్యారు. అందులో అమితాబ్ బచ్చన్ కూడా ఒకరు. తాజాగా ‘కల్కి 2898 ఏడీ’లో నటించిన ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు బాలీవుడ్ బిగ్ బి.
ప్రేక్షకులు ధన్యవాదాలు..
‘కల్కి 2898 ఏడీ’లో అశ్వద్ధామ పాత్రలో కనిపించారు అమితాబ్ బచ్చన్. ఫస్ట్ లుక్ నుండే ఆయన పాత్ర గురించి ఏ మాత్రం సస్పెన్స్ పెట్టకుండా ఓపెన్‌గానే చెప్పేశారు మేకర్స్. అనుకున్నట్టుగానే ప్రభాస్‌కు ధీటైన పాత్ర అంటూ అమితాబ్ చేసిన అశ్వద్ధామ క్యారెక్టర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ సీనియర్ నటుడు. ఇప్పటికే ప్రభాస్ ఎన్నో పెద్ద సినిమాలు చేశాడని, అందులో ‘కల్కి 2898 ఏడీ’ కూడా యాడ్ అయ్యిందని అన్నారు. ముందుగా ‘కల్కి 2898 ఏడీ’ను ఇంతలా సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని వ్యాఖ్యలు చేశారు.
సర్వ సాధారణం..
‘‘కల్కి 2898 ఏడీకి కావాల్సిన సక్సెస్‌ను, ప్రేమను, ప్రశంసలను అందించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సినిమాకు రూ.1000 కోట్లు వచ్చాయి. ఈ సినిమాలో నాతో పాటు నటించిన వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేయాలి అనుకుంటున్నాను’’ అంటూ కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనె పేరును ప్రస్తావించారు అమితాబ్ బచ్చన్. ‘‘ప్రభాస్‌కు ఇది మామూలు విషయం. ఎందుకంటే ఆయన సినిమాలు రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించడం సర్వ సాధారణం. కానీ నేను మాత్రం ఎప్పటికీ ఈ సక్సెస్‌కు రుణపడి ఉండడం మాత్రమే కాకుండా ‘కల్కి 2898 ఏడీ’ లాంటి ప్రాజెక్ట్‌లో భాగమయినందుకు సంతోషపడతాను’’ అని తెలిపారు.
నాలుగుసార్లు చూశాను..
‘‘నేను ఇప్పటికే కల్కి ‘2898 ఏడీ’ సినిమా నాలుగుసార్లు చూశాను. చూసిన ప్రతీసారి ఒక కొత్త విషయాన్ని గమనించాను’’ అని అన్నారు అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ ‘కల్కి 2898 ఏడీ’ గురించి చేసిన వ్యాఖ్యలను సినీ నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్.. తమ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ మూవీని రూ.600 కోట్ల బడ్జెట్‌తో అశ్విని దత్, స్వప్న దత్, ప్రియాంక దత్‌లు నిర్మించారు. నాగ్ అశ్విన్ లాంటి యంగ్ డైరెక్టర్ టేకింగ్‌ను నమ్మి స్టార్ క్యాస్ట్ అండ్ క్రూ.. తనకు సాయం చేసి ‘కల్కి 2898 ఏడీ’ లాంటి అద్భుతాన్ని ప్రేక్షకులకు అందించారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
Also Read: ‘కల్కి 2898 ఏడీ’ మూవీపై పరుచూరి వ్యాఖ్యలు - అది చాలా కష్టం