Amitabh Bachchan Kalki Look : ప్రభాస్ 'కల్కి'లో అమితాబ్ బచ్చన్ లుక్ చూశారా? 

Amitabh Bachchan: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'కల్కి'లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలుసు. ఈ రోజు ఆయన బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 

Continues below advertisement

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా రూపొందుతున్న టైమ్ ట్రావెల్ ఫిల్మ్ 'కల్కి' (Kalki 2898 AD Movie). ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్న సంగతి ప్రేక్షకులకు తెలుసు. ఈ రోజు అమితాబ్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్ విడుదల చేశారు. 

Continues below advertisement

అమితాబ్ ఎలా ఉన్నారో చూశారా?
Amitabh Bachchan First Look In Project K : అమితాబ్ బచ్చన్ లుక్ అయితే రిలీజ్ చేశారు గానీ... ఆయన ఫేస్ పూర్తిగా రివీల్ చేయలేదు. కేవలం కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. చేతిలో విల్లు తరహా ఆయుధం, నుదుట బొట్టు చూస్తుంటే... సాధువులా అనిపిస్తున్నారు. ''మీ ప్రయాణంలో మేము కూడా ఓ భాగం అయినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది'' అంటూ అమితాబ్ బచ్చన్ కు బర్త్ డే విషెష్ చెప్పింది వైజయంతీ మూవీస్ సంస్థ. 

Also Read ఒంటిపై చైతన్య పేరును చెరిపేసిన సమంత...  మాజీ భర్త గుర్తులు, జ్ఙాపకాలు వద్దని అనుకుంటోందా?

సంక్రాంతికి రావడం సందేహమే!
'మహానటి' తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'కల్కి 2989 ఏడీ'. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై సి. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. రూ. 400 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా... ఇప్పుడు ఆ తేదీకి రావడం సందేహమే.  

'ప్రాజెక్ట్ కె' అంటే... 'కల్కి'
What Is Project K Movie : 'ప్రాజెక్ట్ కె' అంటే ఏమిటి? కొన్ని రోజులుగా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని యావత్ భారతీయ ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్నారు. కల్కి... కలియుగ్... కాల్ చక్ర... కురుక్షేత్ర... 'కె' మీనింగ్ ఇదేనంటూ చాలా టైటిల్స్ వినిపించాయి. ఇప్పుడు 'కె' అంటే ఏమిటి? అని డౌట్స్ అవసరం లేదు. 'ప్రాజెక్ట్ కె' అంటే 'కల్కి' అని చెప్పేశారు.

Also Read  పెళ్లి చేసుకున్న ప్రభాస్, అనుష్క - వాళ్లకు ఓ పాప కూడా, వైరల్ ఫోటోలు

'కల్కి' గ్లింప్స్ విషయానికి వస్తే... సినిమా భారీతనం చూపించారు. ప్రపంచాన్ని దుష్టశక్తి ఆవహించినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుందని 'కల్కి' టీజర్ లో చెప్పారు. ఆ శక్తిగా ప్రభాస్ (Prabhas Role In Kalki)ను చూపించారు. కథలో టైమ్ ట్రావెల్ గురించి హింట్ ఇచ్చారు. దీపికా పదుకోన్ సీన్లు కూడా చూపించారు.

'కల్కి'లో ఎవరెవరు ఉన్నారు?
Kalki 2898 AD movie cast and crew : 'కల్కి'లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రభాస్, దీపిక జంటగా నటిస్తున్న తొలి చిత్రమిది. భారతీయ చిత్ర పరిశ్రమలో లెజెండరీ హీరోలు బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ సైతం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో 'లోఫర్', హిందీలో 'ఎంఎస్ ధోని', 'బాఘీ 2', 'భారత్', 'ఏక్ విలన్ రిటర్న్స్' సినిమాలు చేసిన దిశా పటానీ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నారని సమాచారం. అయితే... ఆ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించలేదు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement