Amitabh Bachchan About Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 ఏడీ’ ఇప్పటికీ టాఫ్ ది టౌన్‌గానే ఉంది. దీనికి పోటీగా ఇతర పాన్ ఇండియా చిత్రాలు ఏవీ ఎక్కువగా విడుదల కాలేదు. విడుదలయిన సినిమాలు కూడా ‘కల్కి 2898 ఏడీ’ సక్సెస్‌ను బ్రేక్ చేయలేకపోయాయి. అలా ఇప్పటికీ ఈ మూవీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక ఈ సినిమా గురించి, దీని సక్సెస్ గురించి మాట్లాడడం కోసం అమితాబ్ బచ్చన్, నాగ్ అశ్విన్ ముందుకొచ్చారు. తాజాగా వీరిద్దరూ ఒక పోడ్కాస్ట్‌ను విడుదల చేశారు. అందుకే సినిమాకు సంబంధించిన ఎన్నో అంశాల గురించి చర్చించుకున్నారు.


ప్రభాస్‌కు సపోర్ట్..


‘కల్కి 2898 ఏడీ’లో అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోగా ప్రభాస్‌కు ఎంత గుర్తింపు లభించిందో.. అశ్వద్ధామగా అమితాబ్‌కు కూడా అదే రేంజ్‌లో ప్రశంసలు దక్కాయి. అందుకే నాగ్ అశ్విన్‌తో కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు బిగ్ బి. ‘ది కల్కి క్రానికల్స్’ అనే పేరుతో నాగ్ అశ్విన్, అమితాబ్ బచ్చన్ మధ్య జరిగిన కల్కి ముచ్చట్లను వైజయంతి మూవీస్.. తమ ఛానెల్‌లో విడుదల చేసింది. ఇందులో ప్రభాస్‌కు సంబంధించిన ఒక సీన్‌ను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు అమితాబ్. ఫస్ట్ హాఫ్‌లో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్.. ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం కోసం తెరకెక్కించినట్టుగా ఉందంటూ వస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.


ఇది ప్రభాస్ సినిమా..


‘‘థియేటర్లలో కూర్చొని చూస్తున్న ప్రేక్షకుల కోసం కొన్ని సీన్స్ ప్రత్యేకంగా సిద్ధం చేశారని సినిమాలో నటించిన వాడిగా, సినీ పరిశ్రమలో ఉన్నవాడిగా నాకు కూడా అనిపించింది. ఇది ప్రభాస్ సినిమా. ఒక తెలుగు సినిమా. ప్రభాస్ తెలుగువాడు. తనకు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్‌లో ప్రభాస్‌కు సంబంధించిన సీన్ వచ్చినప్పుడు చాలామందికి స్టోరీలోకి వెళ్తే బాగుంటుంది అని అనిపించి ఉండవచ్చు. దానికి ఆ సీన్ లెన్త్ కూడా కారణం అయ్యిండొచ్చు. కానీ ఇది హీరో ఇంట్రడక్షన్ మాత్రమే కాదు. తెలుగువారికి సంబంధించిన హీరో ఇంట్రడక్షన్. అది చాలామంది అర్థం చేసుకోలేకపోయారు. కానీ మనం కొందరు ప్రేక్షకుల కోసం ఇలాంటివి చేయాలి’’ అని అమితాబ్ బచ్చన్ వివరించారు.


రెబెల్ ఫ్యాన్స్..


నాగ్ అశ్విన్ కూడా ఈ సీన్ గురించి తన వివరణ ఇచ్చాడు. ‘‘ఇది చాలా చిన్న విషయం. ప్రభాస్ ఇంట్రడక్షన్‌లో జరిగే విషయాలు ప్యారిస్‌లో కూర్చొని చూసే ప్రేక్షకులకు అర్థం కాకపోవచ్చు. ఆ సీన్‌లో హోలోగ్రామ్‌లో కొన్ని క్షణాల వరకు రెబెల్ స్టార్ అనే ట్యాగ్ కనిపిస్తుంది. కానీ చాలావరకు ప్రేక్షకులకు అందులో పెద్దగా తేడా కనిపించకపోవచ్చు. అంతే కాకుండా కల్కి 2898 ఏడీలో భైరవ.. నాకు ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్తే.. అవును, నాకు రెబెల్ ఫ్యాన్స్ తెలుసు అని బుజ్జి అంటుంది. కొందరు ప్రేక్షకులకు ఇది పెద్దగా అనిపించకపోయినా రెబెల్‌గా చూపించినందుకు ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యింటారు’’ అని నాగ్ అశ్విన్ తెలిపాడు.



Also Read: ఓటీటీ ప్రేక్షకులను వణికిస్తున్న 5 లేటెస్ట్ మలయాళీ హర్రర్ మూవీస్ - వీటిని అస్సలు మిస్ కావద్దు