Amaran movie review in Telugu: కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తెలుగులోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన 'సీమ రాజా', 'వరుణ్ డాక్టర్', 'డాన్' సినిమాలు తెలుగులోనూ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ హీరో 'అమరన్'తో దీపావళికి థియేటర్లలో సందడి చేయడానికి వచ్చారు. సాయి పల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది? సోషల్ మీడియాలో టాక్ ఏమిటి? అనేది చూస్తే...
ఆర్మీకి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ 'అమరన్'
రియల్ లైఫ్ స్టోరీ బేస్ చేసుకుని 'అమరన్' తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆర్మీకి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. భారత సైనికుల ధైర్య సాహసాలను తెరపై చక్కగా ఆవిష్కరించారని కొనియాడారు. గుండెల్లో దేశభక్తి కలిగించే చిత్రమిదని పేర్కొన్నారు.
'అమరన్'లో దేశభక్తితో పాటు కమర్షియల్ యాక్షన్ ప్యాక్డ్ మూమెంట్స్ కూడా బాగా ఉన్నాయట. విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ తీసిన 'తుపాకీ'లో యాక్షన్ సీన్స్ తరహాలో 'అమరన్'లో సన్నివేశాలు థ్రిల్ ఇస్తాయట.
శివ కార్తికేయన్ యాక్టింగ్ మీద ప్రశంసలు
ఇప్పటి వరకు బాయ్ నెక్స్ట్ డోర్, ఫన్ అండ్ ఫ్యామిలీ డ్రామా రోల్స్ చేసిన శివ కార్తికేయన్... ఫస్ట్ టైమ్ 'అమరన్'లో ఒక మెచ్యూర్ రోల్ చేశారని, అతడిని ఈ తరహా పాత్రలో చూడటం చాలా బావుందని మరొక నెటిజన్ పేర్కొన్నారు. హీరోకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.
Also Read: లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
'సీతారామం'లో దుల్కర్ - మృణాల్...
ఇప్పుడు శివ కార్తికేయన్ - సాయి పల్లవి!
'ప్రేమమ్' సినిమా చూసి సాయి పల్లవికి ఫోన్ చేస్తే 'అన్నయ్యా' అని అన్నదని ఆ మధ్య ఒక ఈవెంట్‌లో శివ కార్తికేయన్ చెప్పారు. ఇప్పుడు వాళ్లిద్దరూ జంటగా ఈ సినిమాలో నటించారు. 'సీతారామం' సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంట మధ్య కెమిస్ట్రీ ఎంత అద్భుతంగా కుదిరిందో? ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య కూడా కెమిస్ట్రీ అంతే బావుందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఈ కపుల్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతారని చెప్పాడు.
Also Read: క రివ్యూ: కిరణ్ అబ్బవరం 2.ఓ - సినిమా ఎలా ఉంది? హిట్టా? ఫట్టా?
బ్లాక్ బస్టర్ 'అమరన్'... ఫస్టాఫ్ రివ్యూ!
తమిళనాడులో కొన్ని థియేటర్లలో 'అమరన్' ఎర్లీ మార్నింగ్ షోస్ పడ్డాయి. అక్కడ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ముఖ్యంగా బ్లడ్ బాత్, ఆల్ఫా సన్నివేశాలు అదిరిపోయాయట. ఆ ట్వీట్స్ ఒక్కసారి చూడండి.