నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రెండు కొత్త సినిమాల అప్డేట్స్ వదిలారు. ఇన్నాళ్లూ వార్తల్లో ఉన్న Mega156 & Mega157 ప్రాజెక్ట్స్ ను మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా నెక్స్ట్ చేయబోయే మూవీ డైరెక్టర్ ఎవరో వెల్లడించకుండా, ఆ తర్వాత నటించబోయే సినిమా వివరాలు ప్రకటించారు.
చిరంజీవి #Mega157 చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేయనున్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ఈ సోషియో ఫాంటసీ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. మంగళవారం రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. మరోవైపు #Mega156 మూవీని గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో మెగా డాటర్ సుష్మిత కొణిదెల నిర్మాణంలో చేయనున్నట్లు తెలిపారు. మెగా రాకింగ్ ఎంటర్టైనర్ తో రాబోతున్నట్లు చెప్పారు కానీ, డైరెక్టర్ ఎవరనేది రివీల్ చెయ్యలేదు.
పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయనున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. మలయాళ చిత్రం 'బ్రో డాడీ' తరహా స్క్రిప్ట్‌ను డెవలప్ చేసే బాధ్యతను 'బంగార్రాజు' దర్శకుడికి అప్పగించారని టాక్ నడిచింది. కానీ Mega156 అనౌన్స్ మెంట్ పోస్టర్ లో మాత్రం డైరెక్టర్ పేరు కనిపించలేదు. దీంతో ముందుగా అనుకున్న కథ మారబోతోందా? లేదా దర్శకుడే మారబోతున్నాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో 'భోళా శంకర్' మూవీ డిజాస్టర్ ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని, 'బ్రో డాడీ' లాంటి చిత్రం తనకు సరిపోతుందా అని చిరంజీవి ఆలోచనలలో పడ్డారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ ను తాత్కాలికంగా నిలిపివేసారని, అందుకే Mega156 పోస్టర్ లో కళ్యాణ్ కృష్ణ కురసాల పేరుని ప్రకటించలేదని అంటున్నారు. ఇక్కడ వినిపిస్తున్న మరో టాక్ ఏంటంటే.. చిరంజీవి 156వ సినిమా కోసం కల్యాణ్ కృష్ణతో పాటుగా మరో దర్శకుడు కూడా పరిశీలనలో ఉన్నారట.
Also Read: MEGA156 - మెగా డాటర్ సుష్మిత నిర్మాతగా చిరంజీవి 'మెగా రాకింగ్' ఎంటర్టైనర్!
'ప్రేమ ఇష్క్ కాదల్' దర్శకుడు పవన్ సాధినేని.. మెగాస్టార్ తదుపరి ప్రాజెక్ట్ కోసం కథ రెడీ చేస్తున్నారట. ఇటీవల 'దయా' వెబ్ సిరీస్ తో మెప్పించిన పవన్.. అంతకముందు సుష్మిత కొణిదెల నిర్మాణంలో 'సేనాపతి' అనే సిరీస్ ను రూపొందించారు. ఆ సమయంలో చిరు కూడా పవన్ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ డైరెక్టర్ ఇప్పుడు చిరంజీవి స్క్రిప్టు మీద వర్క్ చేస్తున్నారట.
కల్యాణ్ కృష్ణ, పవన్ సాధినేనిలలో ఎవరు కథతో ఇంప్రెస్ చేస్తే వాళ్ల చేతికి ఈ Mega156 ప్రాజెక్ట్ వెళ్తుందని.. అందుకే నిన్నటి పోస్టర్ లో దర్శకుడి పేరు ప్రస్తావించలేదని సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నిజమెంతనేది తెలియదు కానీ.. చిరంజీవి నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరనేది తెలుసుకోవాలని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే 'భోళా శంకర్' వంటి భారీ డిజాస్టర్ తర్వాత చేయబోయే సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. మరి త్వరలోనే Mega156 దర్శకుడిని ప్రకటిస్తారేమో చూడాలి.
Also Read: 'నా సామి రంగా' - సంక్రాంతికే రావాలని ఫిక్స్ అయిన కింగ్?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial