Allu Arjun Roles Viral In Atlee Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో పాన్ వరల్డ్ రేంజ్‌లో మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ హైప్ మామూలుగా లేదు. ఏ చిన్న బజ్, అప్డేట్ వచ్చినా క్షణాల్లోనే ట్రెండ్ అవుతోంది. బన్నీ రోల్ ఏంటి అనే దానిపై ఇప్పటికే ప్రచారం సాగినప్పటికీ తాజాగా మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

Continues below advertisement


అట్లీ ప్లానింగ్ వేరే లెవల్...


తొలుత అల్లు అర్జున్ మూడు డిఫరెంట్ రోల్స్‌లో కనిపిస్తారనే ప్రచారం సాగింది. అయితే... ఆయన ఈ మూవీలో నాలుగు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా బన్నీ 3 జనరేషన్స్‌లో నాలుగు కీలక రోల్స్‌లో కనిపించనున్నారని సమాచారం. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా ఆయన సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.


బన్నీ డిఫరెంట్ లుక్స్


అట్లీ ప్లానింగ్ ప్రకారం స్టోరీకి అనుగుణంగా బన్నీ నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించేందుకు రెడీ అవుతున్నారట. ఇప్పటికే ఆయన ఎయిర్‌పోర్టుల్లో కనిపించిన లుక్స్ వైరల్ కాగా... హీరో లుక్స్‌కు సంబంధించి మూవీ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఒకవేళ ఆ న్యూస్ నిజమైతే ఓ మూవీ కోసం ఇన్ని డిఫరెంట్ రోల్స్‌లో బన్నీ నటించనుండడం ఇదే ఫస్ట్ టైం కానుంది.


Also Read: 'సూత్రవాక్యం' రివ్యూ: అబ్బాయి మిస్సింగ్ కేసులో బయటపడ్డ అమ్మాయి మర్డర్... తెలుగు నిర్మాతలు తీసిన మలయాళ సినిమా ఎలా ఉందంటే?


స్టోరీ ఏంటంటే?


సమాంతర ప్రపంచం, పునర్జన్మ బ్యాక్ డ్రాప్‌గా సైన్స్ ఫిక్షనల్‌గా హాలీవుడ్ రేంజ్‌లో 'AA22' (వర్కింగ్ టైటిల్) మూవీని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. దీని కోసం ఓ సరికొత్త వరల్డ్‌నే సృష్టించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. హాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తోంది. ఈ సినిమా దేశంలోనే అత్యంత ఖరీదైనదని... మూవీ లవర్స్ అంతా గర్వపడేలా చేస్తామని ఇదివరకే అట్లీ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు 'ఐకాన్' అనే టైటిల్ ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.


విలన్‌గా ఆస్కార్ విన్నర్


ఈ సినిమాలో విలన్‌గా ఆస్కార్ విన్నర్, హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ అనే ప్రచారం సాగుతోంది. ఇదివరకూ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్స్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఆయన సొంతం కాగా... మూవీలో బన్నీకి ఆయనైతేనే పర్ఫెక్ట్ అని టీం భావిస్తోందట. ఇప్పటికే ఆయన్ను టీం సంప్రదించినట్లు తెలుస్తోంది. 


ఐదుగురు హీరోయిన్స్


ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తారనే ప్రచారం సాగుతోంది. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్‌ను అఫీషియల్‌గా టీం కన్ఫర్మ్ చేయగా... మిగిలిన రోల్స్‌లో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక, భాగ్యశ్రీ బోర్సే పేర్లు వినిపిస్తున్నాయి. సినిమాలో దీపికా వారియర్ ప్రిన్సెస్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ అధినేత కళానిధి మారన్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇండియాలోనే భారీ బడ్జెట్ సినిమాల్లో ఈ ప్రాజెక్ట్ ఒకటవుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.