Allu Arjun to attend Mangalavaram movie pre release event : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా వస్తున్నారు. 'మంగళవారం' సినిమా కోసం శనివారం ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అసలు వివరాల్లోకి వెళితే...
'ఆర్ఎక్స్ 100', 'మహా సముద్రం' సినిమాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా 'మంగళవారం'. తొలి సినిమాతో తెలుగు సంచలనం సృష్టించిన దర్శకుడు ఆయన. మొదటి సినిమా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ప్రధాన పాత్రధారిగా కొత్త సినిమా చేశారు. నవంబర్ 17న థియేటర్లలోకి సినిమా రానుంది. అయితే... అంత కంటే ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
అల్లు అర్జున్ అతిథిగా 11న ప్రీ రిలీజ్ ఫంక్షన్
Mangalavaram pre release function : 'మంగళవారం' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 11న హైదరాబాద్ సిటీలోని జేఆర్సీ కనెక్షన్ సెంటర్లో జరగనుంది. ఆ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నారు. అజయ్ భూపతికి చెందిన 'ఏ క్రియేటివ్ వర్క్స్' సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నిర్మాత స్వాతి, అల్లు అర్జున్ సన్నిహితులు. ఆమె కోసం ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలిసింది. నేషనల్ అవార్డ్ అందుకున్న తర్వాత బన్నీ వస్తున్న ఫస్ట్ పబ్లిక్ ఫంక్షన్ ఇదే కావడం గమనార్హం.
Also Read : నా బాడీ వాడుకున్నారు, రష్మిక వీడియోతో నాకు సంబంధం లేదు - బ్రిటిష్ ఇండియన్ మోడల్ రియాక్షన్
'ఆర్ఎక్స్ 100' కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండతో జీఏ 2 పిక్చర్స్ సంస్థ 'చావు కబురు చల్లగా' సినిమా నిర్మించింది. ఆ సినిమా ఫంక్షన్ ఒకదానికి బన్నీ అతిథిగా హాజరు అయ్యారు. అప్పుడు 'ఆర్ఎక్స్ 100' గురించి మాట్లాడారు. అయితే... ఆ సినిమా దర్శకుడు అజయ్ భూపతి, అల్లు అర్జున్ ఇప్పుడు ఓ వేదికపై కనిపించనున్నారు.
Also Read : పవన్ కళ్యాణ్ సినిమాపై పుకార్లకు చెక్ పెట్టిన హరీష్ శంకర్ - 'నో' రవితేజ సినిమా!
'మంగళవారం' సినిమాలో అజ్మల్ ఆమిర్, నందితా శ్వేతా, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి ఆ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : దాశరథి శివేంద్ర, కూర్పు : మాధవ్ కుమార్ గుళ్ళపల్లి, మాటలు : తాజుద్దీన్ సయ్యద్ - రాఘవ్, కళా దర్శకత్వం : మోహన్ తాళ్లూరి, ఫైట్ మాస్టర్స్ : రియల్ సతీష్ - పృథ్వీ, నిర్మాతలు : స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : అజయ్ భూపతి.