Allu Arjun Review On Kantara Chapter 1: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి రీసెంట్ మూవీ 'కాంతార చాప్టర్ 1' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెెలిసిందే. రిషబ్ మూవీలో హీరోగా నటిస్తూనే దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. సెలబ్రిటీల నుంచి క్రిటిక్స్ వరకూ అందరూ సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజాగా... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీని చూసి టీంను అప్రిషియేట్ చేశారు.
అద్భుతమైన సినిమా
'కాంతార చాప్టర్ 1' అద్భుతమైన సినిమా అని అల్లు అర్జున్ ప్రశంసించారు. 'గురువారం రాత్రి కాంతార చాప్టర్ 1 చూశాను. వావ్, ఎంత అద్భుతమైన సినిమా. దాన్ని చూస్తూ నేను ఒకింత అయోమయంలో ఉన్నాను. రచయిత, దర్శకుడు, నటుడిగా వన్ మ్యాన్ షో చేసినందుకు రిషబ్ గారికి అభినందనలు. ఆయన ప్రతీ క్రాఫ్ట్‌లోనూ రాణించారు. రుక్మిణీ వసంత్ నటన అద్భుతం. జయరాం, గుల్షన్ దేవయ్య, ఇతర టెక్నికల్ టీం వర్క్ సూపర్‌గా ఉంది.
ముఖ్యంగా అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్, అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ, ధరణి గంగే ఆర్ట్ డైరెక్షన్, అర్జున్ రాజ్ స్టంట్స్, ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్ ఇలా టీం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు. నిజానికి ఆ ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే మాటలు సరిపోవు.' అంటూ 'X'లో రాసుకొచ్చారు.
Also Read : ఓటీటీలోకి 'కొత్త లోక: చాప్టర్ 1' - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది... ఎప్పటి నుంచో తెలుసా?
అక్టోబర్ 2న పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన మూవీ రూ.1000 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ రూ.818 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్క తెలుగు వెర్షనే రూ.100 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఈ ఏడాది అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసినట్లు మూవీ టీం వెల్లడించింది. ఇక ఇంగ్లీష్‌లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్ 2 గంటల 14 నిమిషాలుగా ఫిక్స్ చేశారు.
మూవీలో రిషబ్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే జయరాం, గుల్షన్ దేవయ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిిరంగదూర్ ప్రొడ్యూస్ చేయగా... అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు.