Pushpa 2 Teaser Release Date: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ప్రస్తుతం ‘పుష్ప 2’ కోసమే వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బన్నీ చివరి చిత్రం ‘పుష్ప’.. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కానీ ఆ మూవీ వచ్చి దాదాపు రెండున్నర సంవత్సరాలు దాటిపోయింది. అందుకే ‘పుష్ప 2’ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అందరూ ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఇక ఆగస్ట్ 15న రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకున్న ‘పుష్ప 2’ నుంచి ఇప్పటివరకు పెద్దగా అప్డేట్స్ ఏమీ రాలేదు. షూటింగ్ ప్రారంభమయిన మొదట్లో రెండు పోస్టర్లు, ఒక గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇక ఏప్రిల్ 8న టీజర్ రిలీజ్ సందర్భంగా మరో కొత్త పోస్టర్‌ను వదిలాడు అల్లు అర్జున్.


అదే గెటప్..


ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కచ్చితంగా.. ‘పుష్ప 2’ నుంచి ఏదో ఒక అప్డేట్ ఆశిస్తారు. అందుకే పుష్ప మాస్ జాతర మొదలు అంటూ అదే రోజు టీజర్‌ను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక టీజర్‌కు ఇంకా కొన్నిరోజులే సమయం ఉండడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తానే స్వయంగా మరో కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో అల్లు అర్జున్ త్రిశూలం పట్టుకొని, శంఖం ఊదుతూ కనిపిస్తాడు. కానీ తన ఫేస్ మాత్రం ఇందులో పూర్తిగా రివీల్ అవ్వలేదు. కళ్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ పోస్టర్‌ను చూస్తుంటే ఇప్పటికే విడుదలయిన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ గెటప్‌లోనే ఇది కూడా ఉన్నట్టు అర్థమవుతోంది.






రిచ్‌గా రష్మిక..


ఇప్పటివరకు ఈ గ్రాండ్ సీక్వెల్ నుంచి అల్లు అర్జున్‌కు సంబంధించిన ఒక్క పోస్టర్ అయినా విడుదలయ్యింది. కానీ రష్మిక లుక్‌ను మాత్రం ఇప్పటివరకు దాచిపెట్టారు మేకర్స్. ఇక రష్మిక పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రోజు తన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. హ్యాపీ బర్త్ డే శ్రీవల్లి అంటూ ఈ లుక్ బయటికొచ్చింది. అల్లు అర్జున్, రష్మికలకు పెళ్లి అవ్వడంతో ‘పుష్ప’ పార్ట్ 1 పూర్తవుతుంది. ఇక పార్ట్ 2లో ‘పుష్ప’కు తగిన భార్యగా శ్రీవల్లి క్యారెక్టర్ ఉంటుందని రష్మిక ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమవుతోంది. ఇందులో తను ఒంటి నిండా నగలతో కనిపించింది. పార్ట్ 1, పార్ట్ 2కు శ్రీవల్లి పాత్రలో ఎంతో తేడా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


నిర్మాతగా కూడా..


సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ను పార్ట్ 1 కంటే గ్రాండ్‌గా తెరకెక్కిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్. అంతే కాకుండా తన సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ ద్వారా సుకుమార్ కూడా ఇందులో ఒక నిర్మాతగా మారాడు. "పుష్ప మాస్‌ జాతర మళ్లీ మొదలైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న'పుష్ప 2: ది రూల్‌' టీజర్‌ ఏప్రిల్‌ 8న విడుదల కాబోతుంది. ఆ రోజు పుష్పరాజ్‌ డబుల్‌ ఫైర్‌తో రాబోతున్నాడు. వేచి ఉండండి" అంటూ టీజర్ గురించి మేకర్స్ ఇచ్చిన అప్డేట్ ఫ్యాన్స్‌ను సంతోషపెట్టింది. ఇక అనుకోకుండా టీజర్ కంటే ముందే మరో పోస్టర్ బయటికి రావడం.. వారికి డబుల్ హ్యాపీనెస్‌ను ఇస్తోంది.


Also Read: సెట్‌లో అందరూ చప్పట్లు కొట్టారు, ప్రేక్షకులు మాత్రం ట్రోల్ చేశారు - ‘యానిమల్’పై రష్మిక స్పందన