ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓ భాషలో తెరకెక్కుతోన్న సినిమాలకు ఇతర భాషల్లో నటీనటులు కూడా నటించడం సాధరణంగా జరగుతుంటుంది. టాలీవుడ్ నుంచి కూడా చాలా మంది నటీనటులు ఇతర భాషల్లోని సినిమాల్లో కూడా నటించి మెప్పిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం వస్తే మిస్ కాకుండా ఓకే చేస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ లోని స్టార్ నటుడు బాలీవుడ్ బడా హీరో సినిమాలో నటించే ఛాన్స్ వస్తే తిరస్కరించాడు. ఆయన మరెవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. బాలీవుడ్ లో స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ నటిస్తోన్న ‘జవాన్’ సినిమాలో ఓ అతిథి పాత్ర కోసం బన్నీ ను సంప్రదించారట మేకర్స్. కానీ ఆయన ఆ సినిమాకు నో చెప్పడంతో ఈ మేటర్ హాట్ టాపిక్ గా మారింది.
ఎందుకు వదిలేయాల్సి వచ్చిందంటే..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇతర భాషల్లోనూ ఆయన సినిమాలను ఎక్కువగానే చూస్తుంటారు. అయితే 2021 లో దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ గ్రాఫ్ పెరిగిపోయింది. ఈ సినిమా దేశశ్యాప్తంగా సంచలన విజయం అందుకుంది. విడుదల అయిన అన్ని భాషల్లో శభాష్ అనిపించుకుంది. దీంతో బన్ని క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ, ఫైట్స్ ముఖ్యంగా అల్లు అర్జున్ మ్యానరిజమ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అంతగా ఈ సినిమా ప్రభావం చూపింది. ఈ మూవీ తర్వాత వెంటనే ‘పుష్ప 2’ సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్. మథ్యలో కరోనా వలన కొన్నాళ్లు షూటింగ్ కు అంతరాయం కలిగింది. తర్వాత శర వేగంగా షూటింగ్ పనులు ప్రారంభించారు మేకర్స్. ఈ సినిమా మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు మూవీ టీమ్ ఎంతో కష్టపడుతోంది. బన్నీ కూడా ఈ సినిమాలో తన క్యారెక్టర్ పై పూర్తి దృష్టి పెట్టడంతో మిగతా ప్రాజెక్టులు ఒప్పుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే షారుఖ్ ఖాన్ సినిమాలో అతిథి పాత్ర కోసం అప్రోచ్ అయితే వర్క్ షెడ్యూల్ ఖాళీ లేకపోవడంతో సున్నితంగా తిరస్కరించారట బన్నీ. మరోవైపు ఆయన బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ తొందరపడుతున్నారు. మరి ఫ్యాన్స్ కోరిక బన్నీ ఎప్పుడు నెరవేరుస్తాడో చూడాలి.
‘జవాన్’ సినిమాను తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నాడు. విజయ్ దళపతితో కలిసి మెర్సల్, విజిల్, తెరి, తెరి సినిమాను తెలుగులో ‘పోలీసోడు’ గా విడుదల చేశారు. ఆయన టాలెంట్ చూసి షారుఖ్ ఖాన్ కూడా ఓ ఛాన్స్ ఇచ్చాడు. అట్లీకు ఇదే మొదటి హిందీ సినిమా. అలాగే ఈ సినిమాలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కూడా ఈ మూవీలో నటిస్తున్నాడు. లీడ్ రోల్ లో నయనతార నటిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ జూన్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది.