Pushpa 2 Vs Raghu Thatha: 'పుష్ప 2'కు పోటీగా కేజీఎఫ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి 'రఘు తాత'

Upcoming Movies In August 2024: ఆగస్టులో ఒకే రోజు రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అందులో బన్నీ సినిమా ఒకటైతే ఇంకొకటి కేజీఎఫ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న సినిమా మరొకటి.

Continues below advertisement

Allu Arjun's Pushpa 2 Vs Keerthy Suresh's Raghu Thatha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీ సీక్వెల్ 'పుష్ప: ది రూల్'. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. ఆ సంగతి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పంద్రాగస్టు మీద ఎప్పుడో కర్చీఫ్ వేశారు. కొత్త అప్డేట్ ఏమిటంటే... ఆ తేదీకి మరో సినిమా వస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే... 

Continues below advertisement

పుష్ప: ది రూల్ వర్సెస్ రఘు తాత!
Raghu Thatha Vs Pushpa 2: 'పుష్ప: ది రూల్' థియేటర్లలోకి వస్తున్న ఆగస్టు 15వ తేదీనే విడుదలకు సిద్ధం అయిన మరో సినిమా 'రఘు తాత'. ఇందులో 'మహానటి' కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. విశేషం ఏమిటంటే... ఈ 'రఘు తాత' సినిమాను ప్రొడ్యూస్ చేసింది 'కేజీఎఫ్' ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిలిమ్స్. రీసెంట్‌గా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేశారు.

Also Readపిఠాపురంలో భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన శర్వా - Election Results 2024 వచ్చిన నెక్ట్స్ డే రామ్ చరణ్ అతిథిగా?

'కేజీఎఫ్', ఆ తర్వాత రిషబ్ శెట్టి 'కాంతార', రీసెంట్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ 'సలార్' సినిమాలతో పాన్ ఇండియా లెవల్ ప్రేక్షకుల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హోంబలే ఫిలిమ్స్. ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి మూవీ వస్తే హిట్ గ్యారంటీ హిట్ అనే ముద్ర పడింది. దాంతో 'రఘు తాత' మీద ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. మూవీ టైటిల్ కూడా క్యాచీగా ఉంది. అయితే, ఇది తమిళంలో తీసిన సినిమా. కానీ, పాన్ ఇండియా రిలీజ్ చేసే ఛాన్సులు చాలా వున్నాయట.

Also Readకాజల్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన శంకర్ - Indian 2 ఆడియోలో చందమామ పాత్రపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

పాన్ ఇండియా లెవల్‌లో అల్లు అర్జున్ క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళంలో స్టార్ హీరోలతో సమానంగా ఆయనకు క్రేజ్ ఉంది. 'పుష్ప: ది రైజ్' సినిమాతో తమిళ్, హిందీ, కన్నడ భాషల్లోనూ భారీ విజయం అందుకున్నారు. పైగా 'పుష్పరాజ్' పాత్రలో ఆయన నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం వచ్చింది. దాంతో 'పుష్ప 2' మీద అంచనాలు పెరిగాయి. 


కీర్తీ సురేష్ మలయాళీ. తెలుగులో ఆమెకు 'మహానటి' లాంటి సినిమా చేశారు. ఇంకా స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. తమిళంలోనూ ఆమెకు విజయాలు వున్నాయి. ఈ ఏడాది వరుణ్ ధావన్ 'బేబీ జాన్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ కంటెంట్ బేస్డ్ సినిమాలతో విజయాలు అందుకున్నారు. ఆమెకు తోడు హోంబలే ఫిలిమ్స్ యాడ్ అవ్వడంతో 'పుష్ప 2'కు 'రఘు తాత' ఏ రేంజ్ కాంపిటీషన్ ఇస్తుందో చూడాలి.


'పుష్ప 2'లో అల్లు అర్జున్ సరసన మరోసారి శ్రీవల్లి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న యాక్ట్ చేసింది. ఆల్రెడీ రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు. ఆ రెండిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో మరో సాంగ్ రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ప్రొడ్యూస్ చేశారు.

Continues below advertisement