Kajal Aggarwal: డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్సులు చేసిన కాజల్... భయపడిన ‘సత్యభామ‘ యూనిట్

Suman Chikkala Interview: ‘సత్యభామ‘ సినిమా కోసం హీరోయిన్ కాజల్ అగర్వాల్ చాలా కష్టపడిందని దర్శకుడు సుమన్ చిక్కాల చెప్పారు. డూప్ లేకుండా ఆమె యాక్షన్ సీక్వెన్సులు చేస్తుంటే భయమేసిందని చెప్పుకొచ్చారు.

Continues below advertisement

Director Suman Chikkala About Satyabhama Movie: కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సత్యభామ‘. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ మూవీకి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.

Continues below advertisement

కాజల్ యాక్షన్ సీన్లు చేస్తుంటే భయం అయ్యేది

‘సత్యభామ’ సినిమా కోసం కాజల్ చాలా కష్టపడిందని దర్శకుడు సుమన్ చెప్పారు. “‘సత్యభామ’ సినిమా కథ చెప్పగానే కాజల్ ఓకే చెప్పింది. ఈ సినిమా కోసం ఆమె చాలా కష్టపడింది. యాక్షన్ సన్నివేశాల కోసం చాలా రిస్క్ తీసుకుంది. డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్సులు చేసింది. ఆమె ఫైట్స్ చేస్తుంటే మేం చాలా భయపడేవాళ్లం. ఆమెకు చిన్న గాయం అయినా మిగతా షూటింగ్ కు ఇబ్బంది కలుగుతుంది అనుకునేవాళ్లం. కానీ, తను చాలా ధైర్యంగా యాక్షన్ సన్నివేశాలు చేసింది” అని సుమన్ చెప్పారు. 

ఎమోషన్, యాక్షన్ ఆకట్టుకుంటుంది

‘సత్యభామ’ సినిమాలోని ఎమోషన్, యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టకుంటాయని దర్శకుడు సుమన్ చెప్పారు. “ఈ సినిమాలో ఎమోషన్, యాక్షన్ సమపాళ్లలో ఉంటాయి. నిజానికి కథ రాసేటప్పుడు హీరో కోసమా? హీరోయిన్ కోసమా? అని ఆలోచించలేదు. కథలో అమ్మాయి బాధితురాలిగా ఉంటుంది. అందుకే, లేడీ అయితే ఈ సినిమాకు బాగుంటుంది అనుకున్నాం. ఎమోషన్ ను కాజల్ అద్భుతంగా పండిస్తుంది. దానికి యాక్షన్ తోడైతే ఇంకా బాగుంటుంది అనుకున్నాం. అనుకున్నట్లుగానే తను ఈ సినిమాకు ఓకే చెప్పింది. ఎమోషన్, యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక అమ్మాయికి సాయం చేసే పోలీస్ అధికారిగా కాజల్ ఆకట్టుకుంటుంది” అని వివరించారు. 

వాస్తవ ఘటనలను బేస్ చేసుకుని కథ రాశాం

‘సత్యభామ’ సినిమా కథను వాస్తవ ఘటనలను బేస్ చేసుకుని రాసినట్లు దర్శకుడు సుమన్ చెప్పారు. “‘సత్యభామ’ ఫిక్షన్ కధ. కొందరు పోలీసుల జీవితాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా కథను రాశాం. తొలుత ఈ సినిమాకు పేరు పెట్టలేదు. పురాణాల్లో సత్యభామ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమాకు ఆ పేరు పెట్టాం. ఈ సినిమాలో నవీన చంద్ర కీలక పాత్ర చేస్తున్నాడు. కాజల్ కు సపోర్టుగా ఉంటాడు. కాజల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అందరితో ఈజీగా కలిసిపోతుంది. నిజానికి ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ కు తీసుకెళ్లాలి అనుకున్నాం.  కానీ, ఈ సినిమా కథ హైదరాబాద్ బేస్ గా కొనసాగుతుంది. తెలుగులో చేయడమే మంచిది అనుకున్నాం. ఓటీటీలో అన్ని భాషల్లో వస్తుంది” అని చెప్పారు.

 ‘సత్యభామ’ సినిమాలో కాజల్ ప్రధాన పాత్రలో నటించడగా, నవీన్ చంద్ర కీలక పాత్ర పోషించారు.  అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి ఈ సినిమాను నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 7న థియేటర్లలో విడుదలకాబోతుంది.

Read Also: పెళ్లి చేసుకోవాలనుకున్నా- చిరవకు ఆ ఆలోచననే చంపేసుకున్నా: నటి కాంచన

Continues below advertisement
Sponsored Links by Taboola