Allu Arjun New Look For Atlee Movie With 1.2 Crore Watch: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబోలో పాన్ ఇండియా రేంజ్ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టుపై అప్ డేట్స్ కోసం బన్నీ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
న్యూ లుక్‌లో బన్నీ..
తాజాగా.. బన్నీ న్యూలుక్‌లో అదుర్స్ అనిపించారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నల్లటి అథ్లెటిజర్ డ్రెస్ ధరించి కనిపించారు. అంతే కాకుండా రూ.1.2 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లె వాచ్, మెడలో గొలుసుతో లగ్జరీ లుక్‌లో అదరగొట్టారు. ఈ వీడియో, లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అట్లీ న్యూ మూవీలో లుక్ ఇదేనంటూ నెట్టింట కామెంట్స్ మొదలయ్యాయి. నిజానికి ఈ సినిమాలో ఆయన రోల్ ఏంటనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రాబోయే హై - ఆక్టేన్ ప్రాజెక్ట్ కోసమే ఈ లుక్ కావొచ్చంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.
అట్లీతో మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత నుంచే బన్నీలో ఈ మార్పు వచ్చిందని.. ఇది ఆ మూవీలోనే స్టైలిష్ లుక్ అయి ఉంటుందని భావిస్తున్నారు. తెరి, బిగిల్, మెర్సల్, జవాన్ వంటి దుమ్మురేపిన భారీ బ్లాక్ బస్టర్‌లను అందించిన తమిళ దర్శకుడు అట్లీ, బన్నీతో ఎలాంటి జానర్‌లో మూవీ తీయనున్నారో అనే దానిపై భారీ హైప్ నెలకొంది. హై - ఆక్టేన్ పాన్ - ఇండియా ఫీచర్ ఫిల్మ్ నిర్మించబోతున్నామంటూ సన్ పిక్చర్స్ నిర్మాత కళానిధి మారన్ ఇప్పటికే వెల్లడించారు.
Also Read: అందాల శ్రీలీల.. స్టార్ డమ్ మామూలుగా లేదుగా! - టాలీవుడ్ టూ బాలీవుడ్..
బన్నీ ట్రిపుల్ రోల్?
ఈ మూవీని 'AA22XA6' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. నటీనటులు, జానర్, రిలీజ్ డేట్‌లకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ మూవీలో భారీ వీఎఫ్ఎక్స్ ఉండడం ఖాయమని ఇప్పటికే ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఇందు కోసం అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ కంపెనీతో మూవీ టీం పని చేయనున్నట్లు సమాచారం. మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయి.న్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
తన ప్రతి మూవీ లుక్, స్టైల్ విషయంలో అల్లు అర్జున్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. దాదాపు గత నాలుగైదేళ్లుగా బన్నీ.. 'పుష్ప రాజ్' లుక్ మెంటైన్ చేశారు. ఆ మూవీ భారీ హిట్ కొట్టిన క్రమంలో తన తర్వాత సినిమాలో లుక్ పూర్తి వేరియేషన్ చూపించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల ముంబై వెళ్లిన బన్నీ.. అక్కడ మహబూబ్ స్టూడియోలో అట్లీ మూవీ కోసం లుక్ టెస్ట్ నిర్వహించారు. రగ్గడ్ లుక్ నుంచి స్టైలిష్ అండ్ స్లీక్ లుక్ వరకు వివిధ వేరియేషన్స్ ట్రై చేశారు. ఈ సినిమాలో బన్నీ ట్రిపుల్ రోల్ చేస్తున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. తండ్రి పాత్రలో పాటు ఇద్దరు కొడుకులుగా ఆయన కనిపించనున్నారని సమాచారం. మరి అట్లీ ప్రాజెక్ట్ క్రేజీ అప్‌డేట్స్ కోసం కొంతకాలం ఆగాల్సిందే.