ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు (ఏప్రిల్ 8) ఇవాళ. సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. మరి, అల్లు అర్జున్ తన పుట్టిన రోజును ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తెలుసా?
ఫ్యామిలీతో బన్నీ సెలబ్రేషన్స్!అల్లు అర్జున్ తన పుట్టిన రోజు రాత్రి బయటకు ఎక్కడికి వెళ్ళలేదు. భార్య అల్లు స్నేహ రెడ్డి, కుమారుడు అయాన్, కుమార్తె అర్హతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. అమ్మాయితో కలిసి కేక్ కట్ చేశారు. తమ కుటుంబంతో జరిగిన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోను అల్లు స్నేహారెడ్డి ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. ఇవాళ సాయంత్రం స్నేహితులకు అల్లు అర్జున్ పార్టీ ఇవ్వనున్నట్లు సమాచారం.
పుష్ప 2 విజయం తర్వాత...!'పుష్ప 2 ది రూల్' సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు అల్లు అర్జున్. ఆ విజయం తర్వాత వచ్చిన మొదటి పుట్టిన రోజు ఇది. దాంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తరాది ప్రేక్షకులు కూడా అల్లు అర్జున్ రియల్ లైఫ్ గురించి చూసే రోజులు వచ్చాయి. ఫ్యామిలీతో బర్త్ డే సెలబ్రేట్ చేసుకొని కపుల్ గోల్స్ సెట్ చేశారు బన్నీ.
ఇవాళే అట్లీతో సినిమా ప్రకటన!'పుష్ప 2 ది రూల్' విజయం తర్వాత ఎవరి దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నారనే ప్రశ్నకు సమాధానం లభించింది. తమిళ దర్శకుడు అట్లీతో ఆయన భారీ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేయనున్న ఈ సినిమాను ఈరోజు సాయంత్రం అనౌన్స్ చేయనున్నారు.