'పుష్ప 2' సినిమాకు పైరసీ సెగ తగిలింది. నెట్టింట సాధారణంగా సినిమాలను లీక్ చేస్తూ ఉంటారు. కానీ, ఇక్కడ లీక్ అయ్యింది సినిమా కాదు! జస్ట్... ఫస్ట్ లుక్! అదీ రేపు రిలీజ్ కావాల్సిన లుక్ నేడు నెట్టింట్లోకి వచ్చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'పుష్ప 2' (Pushpa 2 Movie). పాన్ ఇండియా సక్సెస్ సాధించిన 'పుష్ప' చిత్రానికి ఇది సీక్వెల్. ఏప్రిల్ 8న (అనగా రేపు) అల్లు అర్జున్ పుట్టిన రోజు (Bunny Birthday). ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'పుష్ప 2' సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేసింది. అయితే, అంత కంటే ముందు ఆ లుక్ నెట్టింట లీక్ అయ్యింది. అల్లు అర్జున్ లుక్ లీక్ అయిన కొంత సమయానికే ఆఫీషియల్ గా రిలీజ్ చేశారు.
అల్లు అర్జున్ ఫస్ట్ లుక్
Allu Arjun First Look - Pushpa 2 : పైన ఫొటోలో మీరు చూసినది 'పుష్ప 2'లో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్కే. అందులో మరో సందేహం లేదు. అధికారికంగా చిత్ర బృందం విడుదల చేయడానికి ముందు లీక్ చేసేశారు. ఇప్పుడీ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అభిమానులు అయితే అరాచకం, అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
'పుష్ప' ఎక్కడ ఉన్నాడో చెప్పేశారుగా!
'పుష్ప ఎక్కడ?' అంటూ యూనిట్ విడుదల చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ రోజు పుష్పరాజ్ ఎక్కడ ఉన్నాడో చెప్పేశారు. తొలి భాగంలో చూపించిన దానికి పూర్తి భిన్నంగా మలి భాగం ఉంటుందని పుష్ప ఎక్కడ ఉన్నాడో రివీల్ చేసిన వీడియో చూస్తే అర్థం అవుతోంది.
శేషాచలం అడవుల్లో పుష్పరాజ్ ఉన్నట్లు చూపించారు. 'పుష్ప'లో కథానాయకుడిని కేవలం స్మగ్లర్ కింద చూపిస్తే... ఇప్పుడీ రెండో భాగంలో ఆయన్ను నాయకుడిని చేశారు. స్మగ్లింగ్ చేసి సంపాదించిన డబ్బుతో పేదలకు ఓ దారి చూపించడం మాత్రమే కాదు... వాళ్ళ పిల్లలకు విద్య, అవసరమైన వాళ్ళకు వైద్యం చేయించినట్టు తెలిపారు. దాంతో 'పుష్ప'కు అభిమానులు ఏర్పడ్డారు.
పులి రెండు అడుగులు వెనక్కి వేస్తే... 'వేర్ ఈజ్ పుష్ప' వీడియో మొత్తం ఒక ఎత్తు... చివరలో కేశవ చెప్పే మాట మరో ఎత్తు! అడవిలో పులుల జాడ తెలుసుకోవడం కోసం నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఓ కెమెరాలో పులి కనబడుతుంది. అలాగే, కంబలి కప్పుకున్న మరో మనిషి కూడా! అతడిని చూసి పులి రెండు అడుగులు వెనక్కి వేస్తుంది. అప్పుడు వెనుక ఓ డైలాగ్.'అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి రెండు అడుగులు వెనక్కి వస్తే పుష్ప వచ్చాడని అర్థం' అని కేశవ చెప్పే డైలాగుతో పుష్ప ముఖాన్ని చీకటిలో చూపించారు. పుష్ప బతికి ఉన్నాడని ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
Also Read : 'రావణాసుర' రివ్యూ : మాస్ మహారాజా రవితేజ విలనిజం బావున్నా... ఎక్కడ తేడా కొట్టిందంటే?
సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ ఇన్ అసోసియేట్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవల్లి పాత్రలో రష్మికా మందన్నా (Rashmika Mandanna) మరోసారి సందడి చేయనున్నారు.
Also Read : రవితేజ - వరుణ్ ధావన్ - రానా - ఓ బాలీవుడ్ మల్టీస్టారర్!