Allu Arjun Attends Pushpa Screening: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌, ఇండియన్‌ మూవీ లవర్స్‌ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇంటర్నేషనల్‌ వేదికపై పుష్ప: ది రైజ్‌ మూవీకి దక్కిన అరుదైన గౌరవమే. అల్లు అర్జున్‌ - క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కించిన పుష్ప: ది రైజ్‌ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో బన్నీ నేషనల్‌ స్టార్‌ అయిపోయాడు. అంతేకాదు ఈ మూవీకి గానూ రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. నేషనల్‌ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడిగా బన్నీ రికార్డు స్రష్టించాడు. ఇక రీసెంట్‌గా అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. 


అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్లో ఇండియన్‌ సినిమా తరపున ప్రాతినిధ్యం వహించే అవాకాశం అల్లు అర్జున్‌కి దక్కిన సంగతి తెలిసిందే. ఇందులో కోసం ఇటీవల జర్మనీ వెళ్లిన బన్నీ ప్రస్తుతం అక్కడ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న 74వ బెర్లిన్‌ ఫిలిం ఫెస్టివల్లో ఇండియన్‌ సినిమా తరపున ప్రాతినధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కు నేషనల్‌ స్టార్‌ గుర్తింపు తెచ్చిపెట్టిన పుష్ఫ: ది రైజ్‌ మూవీని బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఈ ఇంటర్నేషన్‌ వేదికపై పుష్ప పార్ట్‌ 1ను స్పెషల్‌ స్ట్రీనింగ్‌ చేశారు నిర్వాహకులు. దీంతో పుష్ఫ ది రైజ్‌కు దక్కిన అరుదైన గౌరవంతో ఐకాన్‌ స్టార్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


ఈ సందర్భంగా పుష్ప సిజిల్‌ పేరుతో పుష్ప ది రైజ్‌, పుష్ప ది రూల్‌కు సంబంధించిన గ్లింప్స్‌తో స్పెషల్‌ వీడియోనను నెట్టింట వైరల్‌ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుష్ప: ది రూల్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఫస్ట్‌ పార్ట్‌ సంచలన విజయం సాధించడంతో రెండో పార్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021లో బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఫస్ట్‌ పార్ట్‌తో సీక్వెల్‌పై విపరీతమైన బజ్‌ పెంచింది.  దీంతో మూవీ లవర్స్‌ అంతా 'పుష్ప: ది రూల్‌' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఆగస్ట్‌ 15న గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న అల్లు అర్జున్‌ అక్కడ ఓ ఇంగ్లీష్‌ వెబ్‌సైట్‌తో ముచ్చటించారు. 


Also Read: మందుల వల్ల సైడ్‌ ఎఫెక్ట్‌ - 19 ఏళ్లకే 'దంగల్‌' నటి మృతి


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వేడుకలో ‘పుష్ప’ సినిమాను పదర్శించనున్నట్లు తెలిపారు. విదేశీ ప్రేక్షకులు ‘పుష్ప’ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని ఉందన్నారు. భారతీయ సినిమాను వాళ్లు ఏ కోణంలో చూస్తారో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే  ఫిలిం ఫెస్టివల్ కు వచ్చినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఓ హాలీవుడ్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘పుష్ప’ సినిమాతో పోల్చితే ‘పుష్ప 2’లో తన షేడ్స్ చాలా భిన్నంగా ఉంటాయని చెప్పారు. ఈ సినిమాలో తన పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలిపారు.  పుష్పరాజ్ స్కేల్, క్యారెక్టరైజేషన్, కాన్వాస్, ప్రెజెంటేషన్ పెద్ద రేంజిలో ఉంటుందన్నారు. ‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్ ప్రాంతీయ స్థాయిలో తన కార్యకలాపాలు కొనసాగిస్తే, పార్ట్ 2 లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన ఉండబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ గొడవ తీవ్రస్థాయికి వెళ్లనున్నట్లు చెప్పారు.