Allu Arjun's Ala Vaikuntapurramuloo Leave From Netflix Platform: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం 'అల వైకుంఠపురంలో' (Ala Vaikuntapurramuloo). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ కాగా.. టబు, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. తమన్ ఈ మూవీకి సంగీతం అందించగా, అల్లు అరవింద్ - రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాతోనే బన్నీ పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఈ మూవీ 2020 జనవరి 13న థియేటర్లలోకి సంక్రాంతి కానుకగా వచ్చింది.

ఓటీటీలో మాత్రం 2020 ఫిబ్రవరి 27న నెట్ ఫ్లిక్స్‌లో (Netflix) స్ట్రీమింగ్ అయింది. అయితే, దాదాపు ఐదేళ్ల పాటు ఈ ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్‌లో ఉన్న ఈ సినిమా.. అతి త్వరలో డిలీట్ కాబోతోంది. ఈ నెల 27 వరకూ మాత్రమే 'నెట్ ఫ్లిక్స్'లో అల వైకుంఠపురంలో సినిమా అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత అందులో ఉండే ఛాన్స్ లేదు. కాగా, ఓ తెలుగు సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్‌లో ఇన్నేళ్ల పాటు స్ట్రీమింగ్‌ కావడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. 

'ఆ ప్లాట్ ఫాంలో సినిమా చూడొచ్చు'

అయితే, నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాను తొలగించినా సన్ నెక్స్ట్‌ (Sun NXT) ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తమన్ మ్యూజిక్, పాటలు సినిమాకే హైలైట్. 'బుట్టబొమ్మ', 'సామజవరగమన' సాంగ్స్ సంగీత ప్రియులను అలరించాయి. 

Also Read: బాక్సాఫీస్ వద్ద దంచి కొడుతోన్న 'తండేల్' - రెండో రోజు కూడా కలెక్షన్ల జోరు, ఫుల్ జోష్‌లో మూవీ టీం

హిట్ కాంబో రిపీట్ అవుతుందా..

కాగా, త్రివిక్రమ్, బన్నీ కాంబో అంటేనే ఓ క్రేజ్. గతంలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి. తాజాగా, వీరి కాంబోలో మరో మూవీ పట్టాలెక్కబోతోంది. మరోసారి 'AA22' ప్రాజెక్టుతో వీరు రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ కొత్త చిత్రం సోషియో మైథలాజికల్ ఫాంటసీ నేపథ్యంలో ఉండబోతున్నట్లు సమాచారం. గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుండగా.. భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు సినీ ఇండస్ట్రీ టాక్. శివ పార్వతుల తనయుడు కార్తికేయ ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కథలో తండ్రీ కొడుకుల పునఃకలయికను చూపించనున్నారని సమాచారం.

కొత్త ట్రెండ్ సెట్ అయ్యేనా..

అటు, పుష్ప 2తో బాక్సాఫీస్‌ను బన్నీ షేక్ చేయగా.. గతేడాది గుంటూరు కారంతో త్రివిక్రమ్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈసారి బన్నీతో డిఫరెంట్ కథాంశాన్ని ఎంచుకోగా ఇది ట్రెండ్ సెట్ చేస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. 'AA22' ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వీడియోను సైతం త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్ వినిపిస్తోంది.

Also Read: అనగనగా... ETV Win కోసం సుమంత్ ఎక్స్‌క్లూజివ్ ఫిల్మ్ - బర్త్‌ డేకి బహుమతిగా ఫస్ట్ లుక్