Allu Arha with Klin Kaara: తాజాగా మెగా ఇంట సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుక కోసం మూడు తరాల మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరింది. మూడు రోజుల సంక్రాంతి ముగిసే వరకు ఈ ఫ్యామిలీ అంతా బెంగుళూరులోని ఫామ్ హౌజ్‌లోనే ఉండనున్నారు. ఇక ఈ సెలబ్రేషన్స్ నుంచి ఎన్నో ఫోటోలు, వీడియోలు బయటికొస్తున్నాయి. అవన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీని అంతా ఒక్కచోట చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ కీబోర్డ్ పర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తాజాగా క్లిన్ కారాతో అల్ల అర్హ చేసిన డ్యాన్స్‌కు కూడా నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.


ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉపాసన


ఇప్పటికే సంక్రాంతి రోజున మెగా ఫ్యామిలీ అంతా కలిసి దిగిన ఫోటోను చాలామంది తమ తమ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేశారు. దీనికి లైకుల మీద లైకులు వచ్చేస్తున్నాయి. దాంతో పాటు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను సంతోషపెడుతున్నారు మెగా కోడలు ఉపాసన. తను షేర్ చేయడం వల్లే అకీరా కీబోర్డ్ పర్ఫార్మెన్స్ గురించి బయటికొచ్చింది. అలాగే ఉపాసన చేతిలో ఉన్న క్లిన్ కారాను పట్టుకొని అల్లు అర్హ.. శ్రీవల్లి పాటకు క్యూట్‌గా స్టెప్పులు వేసింది. ఈ వీడియోను కూడా ఉపాసన.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో ఒకే వీడియోలో ఇద్దరు క్యూటీలను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.


క్లిన్ కారా ఫస్ట్ పార్టీ


రామ్ చరణ్, ఉపాసన ముద్దుల కూతురు క్లిన్ కారా ఎలా ఉంటుంది అని ఇప్పటివరకు వారు రివీల్ చేయలేదు. తన ఫేస్‌ను రివీల్ చేయడం కోసం సరైన సందర్భం కోసం ఈ మెగా కపుల్ ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఉపాసన షేర్ చేసిన అర్హ వీడియోలో కూడా క్లిన్ కారా ఫేస్ కనిపించడం లేదు. ఇది క్లిన్ కారా ఫస్ట్ పార్టీ అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది. దీనికి ఫ్యాన్స్ క్యూట్ అని కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్హ ఏం చేసినా క్యూట్‌గా ఉంటుందని బన్నీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక ఈ సంక్రాంతి వేడుకల్లో అల్లు అర్హతో పాటు అయాన్ కూడా సందడి చేశాడు. పవన్ కళ్యాణ్.. తన కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకలను జరుపుకోలేకపోయినా తన వారసులు అకీరా, ఆద్య మాత్రం మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో కనువిందు చేశారు.






రియల్ లైఫ్‌లో నిజమయ్యింది


చాలాకాలం తర్వాత అకీరా.. సోషల్ మీడియాలో కనిపించాడు. దీంతో తండ్రిలాగానే ఉన్నాడంటూ తండ్రి, కొడుకుల ఫోటోలను పక్కపక్కనే పెట్టి పోల్చి చూడడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. ఇక పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా అకీరా, ఆద్యా ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫోటోలకు పవన్ ‘అన్నవరం’ సినిమాలోని పాటను యాడ్ చేసింది. ‘ఫైనల్‌గా తన తండ్రి పాట రీల్ లైఫ్‌లో కాకుండా రియల్ లైఫ్‌లో నిజం అవుతోంది. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌ను యాడ్ చేసింది. అలా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ఈ మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాల ఫోటోలే కనిపిస్తున్నాయి.


Also Read: అకీరా నందన్ కావాలనే ఆ పాట ప్లే చేశాడా? మెగా సంక్రాంతి సంబరాల్లో తండ్రిని గుర్తుచేసుకుంటూ కీబోర్డ్ పర్పార్మెన్స్!