కాఫీ విత్ కరణ్ (Koffee With Karan) కార్యక్రమం వస్తుందంటే చాలు... ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకంటే... సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలో విషయాలు బయటకు వస్తాయి కనుక! స్టార్ హీరోలు, హీరోయిన్ల చేత పర్సనల్ టాపిక్స్ రివీల్ చేయించడంతో కరణ్ జోహార్ తర్వాతే ఎవరైనా! 


'కాఫీ విత్ కరణ్' లేటెస్ట్ సీజన్ ఈ నెల 7 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ప్రీమియర్ కానుంది. ఫస్ట్ ఎపిసోడ్‌కు హాట్ షాట్ బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్‌ సింగ్, కొత్త పెళ్లి కూతురు ఆలియా భట్ అటెండ్ అయ్యారు. ప్రోమో చూస్తుంటే... వాళ్ళిద్దరూ చాలా విషయాలు షోలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆలియా భట్ ఫస్ట్ నైట్ గురించి చెప్పిన డైలాగ్ మీద అందరి దృష్టి పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 


Also Read : 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు


''ఫస్ట్ నైట్ అనేది ఏదీ ఉండదు. ఆ సమయానికి చాలా అలసిపోయి ఉంటాం'' అని ఆలియా భట్ చెప్పారు. పెళ్లిలో కొన్ని మిత్స్ (అవాస్తవాలు) గురించి చెప్పమని కరణ్ ప్రశ్నించగా... ఆమె సమాధానం ఇచ్చారు. ర‌ణ్‌వీర్‌, వరుణ్ ధావన్... ఇద్దరిలో ఎవరితో మీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బావుంటుందని కూడా ఆలియాను కరణ్ ప్రశ్నించారు. ప్రోమో చూస్తుంటే... సరదాగా ఉంది.  


Also Read : సంసార జీవితాల్లో సంతోషం లేకపోవడానికి నువ్వే కారణం కరణ్ - సమంత