నందమూరి తారక రత్న (Nandamuri Taraka Ratna) మరణం కలిగించిన బాధ నుంచి ఆయన భార్య అలేఖ్యా రెడ్డి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉన్నారు. భర్త లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. తారక రత్న మరణం నుంచి ఆయన్ను తలుచుకుంటూ, ఆ జ్ఞాపకాలతో భావోద్వేగానికి గురి అవుతున్నారు అలేఖ్యా రెడ్డి. మనసుకు స్వాంతన కోసం మెడిటేషన్ చేయడానికి చేయడానికి హైదరాబాద్ నుంచి దూరంగా వెళ్లారు. 


ఇషా ఫౌండేషన్‌లో అలేఖ్య
ఇప్పుడు అలేఖ్యా రెడ్డి కోయంబత్తూరులో ఉన్నారు. సద్గురు (Sadhguru) ఇషా ఫౌండేషన్ (Isha Foundation Coimbatore)కి వెళ్లారు. పెద్దమ్మాయి నిష్క, అలేఖ్య కొన్ని రోజులు అక్కడ ఉంటారని తెలిసింది. 


కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమానికి ప్రముఖులు, ప్రజలు చాలా మంది వెళుతూ ఉంటారు. ప్రశాంతత కోసం యోగ చేస్తూ ఉంటారు. బహుశా... అలేఖ్యా రెడ్డి కూడా కొన్ని రోజులు మెడిటేషన్ చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.


తారక రత్న భౌతికంగా ప్రజల మధ్య లేరు. అయితే, ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ ప్రజలతో ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా ఆయన సతీమణి అలేఖ్యా రెడ్డి పిల్లలలో భర్తను చూసుకుంటున్నారు. తారక రత్న, అలేఖ్యా రెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి పేరు నిష్క. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె ఎంట్రీ ఇచ్చారు. నిష్క తర్వాత కవలలు జన్మించారు. ఆ ఇద్దరిలో ఒకరు అమ్మాయి, మరొకరు అబ్బాయి. తండ్రి మరణం తర్వాత తొలిసారి తారక రత్న వారసుడి ఫోటోను అలేఖ్యా రెడ్డి షేర్ చేశారు.


పెద్దైన తర్వాత తండ్రిలా...
కొన్ని రోజుల క్రితం అబ్బాయి ఫోటోలను అలేఖ్యా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో షేర్ చేశారు. అందులో తండ్రి ఫోటోతో వారసుడు ఉన్నారు. పెద్దైన తర్వాత తండ్రిలా కావాలని అబ్బాయి అంటున్నట్లు అలేఖ్యా రెడ్డి పేర్కొన్నారు. అదీ సంగతి! 


హిందూపూర్ వెళ్ళడానికి ముందు...
తారక రత్న, అలేఖ్యా రెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నిష్క (Taraka Ratna Daughter Nishka) తర్వాత కవలలు (అబ్బాయి, అమ్మాయి) జన్మించారు. ఇప్పుడు తారక రత్న పెద్దమ్మాయి నిష్క సోషల్ మీడియాలో అడుగు పెట్టారు. ఇన్‌స్టాలో అకౌంట్ ఓపెన్ చేశారు. తండ్రితో గేమింగ్ ఆడుతున్న వీడియో షేర్ చేశారు.


Also Read : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?






తండ్రి తారక రత్నతో దిగిన ఫోటోను నిష్క పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆమె తొలి పోస్ట్ అదే. ఆ ఫోటోకి క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. జస్ట్ రెండు లవ్ ఎమోజీలను యాడ్ చేశారు. ఆ తర్వాత తారక రత్న, అలేఖ్యా రెడ్డి ఫోటో పోస్ట్ చేశారు. ''మై పేరెంట్స్! వీళ్ళే నా బలం, నా ప్రేమ'' అని నిష్క పేర్కొన్నారు. ఆ ఫోటోను ఇంస్టాగ్రామ్ స్టోరీలో అలేఖ్యా రెడ్డి షేర్ చేశారు.


తారక రత్న ఫిబ్రవరి 18న మరణించారు. అప్పటి వరకు మౌనంగా ఉన్న అలేఖ్యా రెడ్డి, ఆ తర్వాత నుంచి తరచూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇటీవల నందమూరి బాలకృష్ణను దేవుడిగా వర్ణించారు. హిందూపురంలో నిర్మించిన ఆస్పత్రిలో తారక రత్న పేరు మీద ఓ బ్లాక్ ఓపెన్ చేయడంతో ఆయనది బంగారు మనసు అని పేర్కొన్నారు. దానికి కొన్ని రోజుల ముందు తమ దంపతులపై వివక్ష చూపించారని పేర్కొన్నారు.


Also Read గోపికమ్మ... ఎల్లువొచ్చి గోదారమ్మ... ఇప్పుడు బతుకమ్మ - బుట్ట బొమ్మ హిట్ సాంగ్స్!