అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles) బ్రాండ్ ఇప్పుడూ అందరికీ తెలిసింది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా సరే... ఈ స్థాయిలో ఏ బ్రాండ్ కూడా పాపులర్ కాలేదు. కాంట్రవర్సీ కారణంగా అక్కా చెల్లెళ్లు చాలా ట్రోల్ అవుతున్నారు. అయితే ఆ వివాదం వల్లే అలేఖ్య చిట్టి పికిల్స్ ఇంతకు ముందు తెలియని వాళ్ళకూ ఇప్పుడు తెలిసింది. అలేఖ్య సిస్టర్స్ మీద విమర్శలతో పాటు వాళ్ళ ఫాలోయింగ్ కూడా పెరిగింది.

అలేఖ్య చిట్టి పికిల్స్ ఖాతాలో లక్ష మంది!సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles Instagram ID)ను ఫాలో అవుతున్న వాళ్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇంస్టాగ్రామ్‌లో వల్ల పికిల్స్ బ్రాండ్ అకౌంట్ ఫాలో అవుతున్న వాళ్ల సంఖ్య ఇప్పుడు లక్ష. ఏప్రిల్ 11వ‌ తేదీతో ఈ మైల్ స్టోన్ చేరుకుంది. 

సరిగ్గా వారం క్రితం... ఏప్రిల్ నాల్గవ తేదీన అలేఖ్య చిట్టి పికిల్స్ ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య 77 వేల మంది మాత్రమే. ఆ తర్వాత రోజుకొక కొత్త ఆడియో లీక్ కావడం, అలాగే ట్రోలింగ్ పేజీలు చాలావరకు టార్గెట్ చేయడంతో రోజురోజుకు ఫాలోయింగ్ పెరిగింది.‌ ఒక్క వారంలో 23,000 మంది ఫాలోవర్లు పెరిగారు. 

రమ్య మోక్షకు కూడా భారీ ఫాలోయింగ్!అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ రాక ముందు నుంచి సోషల్ మీడియాలో అలేఖ్య చెల్లెలు రమ్య మోక్ష కంచర్ల పాపులర్. ఆమెను ఇప్పుడు ఆరు లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. కరెక్టుగా చెప్పాలంటే... 6.20 లక్షలు ఈ వివాదానికి ముందు ఆవిడ ఫాలో అవర్ లో 5,75,000 మంది మాత్రమే. ఒక్క వారంలో ఆవిడ ఫాలోయింగ్ 45 వేలు పెరిగింది.

Also Read'గుడ్ బ్యాడ్ అగ్లీ' రివ్యూ: అజిత్ వీరాభిమానులకు పండగ... మరి కామన్ ఆడియన్స్‌కు? గ్యాంగ్‌స్టర్‌ డ్రామా హిట్టా? ఫట్టా?

కస్టమర్లను బూతులు తిట్టినందుకు అలేఖ్య చిట్టి మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కాగా... తాను చేసిన తప్పునకు ఆవిడ సారీ చెప్పారు.‌ అలేఖ్యతో పాటు ఆవిడ అక్కా చెల్లెళ్ళు సుమ, రమ్య మోక్ష కూడా సారీ చెప్పారు. వివాదానికి ఇంతటితో ముగింపు పలకమని కోరారు. అయితే... తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో ట్రోలింగ్ తట్టుకోలేక అలేఖ్య అనారోగ్యం పాలయ్యారని ఆవిడకు ఆసుపత్రిలో చేర్పించామని సుమ మోక్ష చెప్పారు. తమ రిలీజియన్ మీద వచ్చిన విమర్శలకు కూడా రమ్య మోక్ష కంచర్ల వివరణ ఇచ్చారు.

Also Read'జాక్' రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ హ్యాట్రిక్ కొట్టాడా? 'బొమ్మరిల్లు' భాస్కర్ తీసిన సినిమా హిట్టేనా?