Raviteja's Mass Jathara Movie Release Date Locked: మాస్ మహారాజ రవితేజ (Raviteja) లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర' (Mass Jathara) కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. 

రిలీజ్ అప్పుడేనా?

లేటెస్ట్ బజ్ ప్రకారం 'మాస్ జాతర' మూవీ జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. నిజానికి మే 9నే సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా నుంచి ఈ నెల 14న 'తు మేరా లవర్' అనే సాంగ్ రిలీజ్ కానుందని సమాచారం. 

సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన 'ఇడియట్' (Idiot) మూవీలో 'చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే' సాంగ్ ఎంత ట్రెండ్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా 'మాస్ జాతర' సినిమాలోనూ ఈ పాటను రీమిక్స్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే నిజంగా మాస్ జాతరే అంటూ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. 

తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నిర్మాత నాగవంశీ (Nagavamsi) 'మాస్ జాతర' రిలీజ్‌పై కీలక అప్ డేట్ ఇచ్చారు. జులైలోనే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా జులై 18న సినిమా రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది.

Also Read: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్‌డేట్

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా..

ఈ సినిమాలో మాస్ మహారాజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. 'ధమాకా' వంటి హిట్ తర్వాత మరోసారి రవితేజ సరసన శ్రీలీల నటిస్తున్నారు. దీంతో క్రేజీ కాంబోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీకి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత కిశోర్ తిరుమలతో పాటు 'మ్యాడ్' ఫేం కల్యాణ్ శంకర్ చెప్పిన కథలకు రవితేజ ఓకే చెప్పారని తెలుస్తోంది. తాజాగా రవితేజ - కల్యాణ్ ప్రాజెక్టులపై అధికారికంగా క్లారిటీ వచ్చింది. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో నిర్మించనున్నట్లు నాగవంశీ తెలిపారు. ఇటీవలే ఈ ప్రాజెక్టుపై దర్శకుడు కల్యాణ్ శంకర్‌ స్పందించారు.

ఇదొక ఫాంటసీ జోనర్‌లోనే ఉంటుందని.. మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడా మిస్ కాదని తెలిపారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లోనే ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా వచ్చిన లాస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత కాస్త స్లో అయినా మళ్లీ వరుసగా ప్రాజెక్టులను రవితేజ లైన్‌లో పెడుతున్నారు. 'మాస్ జాతర'తో మంచి హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.