Alekhya Chitti apologies to customers: అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ పడిందని అనుకోవచ్చు. సోషల్ మీడియాలో చాలా మంది డిమాండ్ చేసినది జరిగింది. బూతులు తిట్టినందుకు అలేఖ్య చిట్టి సారీ చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే...
తప్పు చేశాను... నన్ను క్షమించండి!''నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నా. నేను తప్పు చేశాను. నేను ఎవరినైతే ఇప్పటి వరకు తిట్టానో... వాళ్లందర్నీ సారీ అడుగుతున్నా'' - ఇదీ రమ్య మోక్ష కంచర్ల తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో ఉన్నది. అందులో అలేఖ్య చిట్టి సారీ చెప్పారు. ఇంతకీ, ఆవిడ అకౌంట్ ఏమైందని అనుకోవచ్చు. అది తెలుసుకోవడానికి కింద లింక్ క్లిక్ చేయండి.
మేటర్ సాగదీయలేదు. సుమ కంచర్ల, రమ్య మోక్ష కంచర్ల తరహాలో పది పది నిమిషాల పాటు వీడియోలు చేయలేదు. అలేఖ్య చిట్టి క్లుప్తంగా సారీ చెప్పారు. ఎందుకు తిట్టాల్సిన వచ్చింది? ఏ పరిస్థితుల్లో ఆ విధంగా చేయాల్సి వచ్చింది? అని వివరణలు ఇవ్వలేదు. ఇప్పటి వరకు తాను తిట్టిన కస్టమర్స్ అందరి నుంచి ఆవిడ క్షమాపణలు కోరారు. దాంతో ఈ వివాదం ఇక సద్దుమణుగుతుందని ఆశించాలి.
''మనుషులు అందరూ తప్పులు చేస్తారని, తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడడం కంటే మించిన ప్రాయశ్చిత్తం లేదు'' అని అలేఖ్య చిట్టి చెల్లెలు రమ్య కంచర్ల తాను పోస్ట్ చేసిన వీడియో కింద కామెంట్ చేశారు.
క్షమాపణలు చెప్పడంపై మిశ్రమ స్పందన!Mixed reactions on Alekhya Chitti sorry video: ''బ్రదర్స్... ఈ మ్యాటర్ ఇక వదిలేయండి. ఆవిడ తప్పు ఒప్పుకొన్నారు కదా! మానవత్వం చూపించాలి. ఈ సమయంలో అందరూ సహనంగా ఉండాలి'' అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. క్షమాపణలు కోరారు కనుక ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలికితే బాగుంటుందని చాలా మంది చెప్పారు. అయితే... అదే సమయంలో కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అలేఖ్య చిట్టి స్థానంలో ఒక అబ్బాయి గనుక ఉండి ఉంటే... అబ్బాయి అదే విధంగా తిట్టి ఉంటే ఈపాటికి సో కాల్డ్ ఫెమినిస్టులు అందరూ కలిసి అరెస్టు చేయించే వారిని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. అలేఖ్య చిట్టి సారీ చెప్పిన వీడియో కింద తిడుతూ పోస్టులు చేసే కామెంట్స్ కొన్నిటిని రమ్య మోక్ష కంచర్ల డలీట్ చేస్తున్నారని ఒకరు కామెంట్ చేశారు.