అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ (Alekhya Chitti Pickles Controversy) కంటిన్యూ అవుతోంది. కస్టమర్లను అలేఖ్య కంచర్ల తిట్టిన ఆడియోలు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాకు ఎక్కుతున్నాయి. ఇప్పుడు మరొక ఆడియో లీక్ అయ్యింది. 

రాయలేని భాషలో బూతులు...చెవులు చిల్లులు పడేలా తిట్లు!అమాయకులను తిట్టడం తమ నైజం కాదంటూ అలేఖ్య చిట్టి పికిల్స్ ఓనర్ అలేఖ్య చెల్లెలు, సోషల్ మీడియాలో పాపులర్ అయిన రమ్య మోక్ష కంచర్ల ఒక వీడియో విడుదల చేశారు. తమ అక్కను ఒక కస్టమర్ బూతులు తిట్టడం వల్ల అతనికి రిప్లై ఇవ్వబోయి మరొకరికి రిప్లై ఇచ్చినట్టు పేర్కొన్నారు. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మరొక ఆడియో వింటే... పికిల్స్ రేట్ ఎక్కువ అని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అలేఖ్య బూతులు తిట్టారని అనుకోవాలి ఏమో!?

రాయలేని భాషలో బూతులు తిట్టడం, చెవుల చెల్లెలు పడేలా తిట్లు తిట్టడం అలేఖ్య నైజమా? అని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఎన్ని ఆడియోలు ఉన్నాయి? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అది సంగతి! ఎందుకంటే ఒక మీమర్ తన దగ్గర నాలుగైదు ఉన్నాయవి వీడియో చేశారు.

Also Readటెస్ట్ సినిమా రివ్యూ: ప్రేక్షకులకు అసలైన పరీక్ష? Netflixలో నయన్, మాధవన్, సిద్ధార్థ్ సినిమా ఎలా ఉందంటే?

మొదటి ఆడియో లీక్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అలేఖ్య కంచర్ల బయటకు రాలేదు. నా చెల్లెలు డిప్రెషన్ లోకి వెళ్లిందని ఆవిడ అక్క సుమ తెలిపారు. ఆ తర్వాత చెల్లెలు రమ్య మోక్ష కంచర్ల మరో వీడియో విడుదల చేశారు. ఇద్దరు క్షమాపణలు అయితే చెప్పలేదు. మొదటి ఆడియో లీక్ కావడంతో ఆ వ్యక్తికి మాత్రం అలేఖ్య క్షమాపణ చెప్పినట్టు పేర్కొన్నారు. 

ఎన్ని ఆడియోలు లీక్ చేసినా... ఆ విధంగా తిట్టడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకోవాలని, తమ పట్ల అభ్యంతరకరమైన భాష వాడిన వాళ్లకు అదే రీతిలో తమ అక్క సమాధానం ఇచ్చిందని అర్థం వచ్చేలా మాత్రమే రమ్య చెప్పారు. దీన్ని‌ బట్టి ఈ విధంగా తిట్టిన ఆడియోలు ఇంకా ఉన్నాయని అనుకోవాలి.

Also Read'హోమ్ టౌన్' రివ్యూ: రాజీవ్ కనకాలతో '90స్' మేజిక్ రీక్రియేట్ చేశారా? AHAలో కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?