Akshay Kumar: నేను చనిపోలేదు, నన్ను కాల్చి చంపేవరకు అదే చేస్తుంటా.. ఏదీ అడుక్కోలేదు - అక్షయ్ కుమార్

Akshay Kumar: ఒకప్పుడు బాలీవుడ్ ఖిలాడిగా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్.. ఇప్పుడు ఒక హిట్ కోసం కష్టపడుతున్నాడు. తన ఫ్లాప్స్‌ను తాను ఎలా తీసుకుంటున్నాడో తాజాగా ఒక ఈవెంట్‌లో బయటపెట్టాడు.

Continues below advertisement

Akshay Kumar At Khel Khel Mein Trailer Launch: ఎంత పెద్ద స్టార్ హీరో అయినా స్క్రిప్ట్ సెలక్షన్ సరిగా లేకపోతే ఫ్లాపులు తప్పవు అని చెప్పడానికి ఎంతోమంది ఉదాహరణగా ఉన్నారు. ఇక తాజాగా బాలీవుడ్‌లో దీనికి ఉదాహరణగా నిలిచాడు అక్షయ్ కుమార్. ఒకప్పుడు అక్షయ్ కుమార్ సినిమా విడుదల అవుతుందంటే చాలు.. ఓపెనింగ్స్‌తోనే రికార్డ్స్ క్రియేట్ చేసేవాడు ఈ హీరో. అలాంటిది దాదాపుగా డజను ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. త్వరలో తన అప్‌కమింగ్ మూవీ ‘ఖేల్ ఖేల్ మే’ విడుదలకు సిద్ధంగా కాగా.. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తన బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ గురించి మాట్లాడాడు ఈ సీనియర్ హీరో.

Continues below advertisement

వింత మెసేజ్‌లు..

‘ఖేల్ ఖేల్ మే’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అక్షయ్ కుమార్ ఫ్లాప్స్ గురించి ఒక రిపోర్టర్ ప్రశ్నించగా.. తనకు చాలా పాజిటివ్‌గా స్పందించాడు. ‘‘ఏం జరిగిన మన మంచికే అనేది నేను చాలా గట్టిగా నమ్ముతాను. దానిగురించి ఎక్కువగా ఆలోచించను, బాధపడను. నిజం చెప్పాలంటే నావి 4,5 సినిమాలు సరిగా ఆడలేదు. దానికే కొందరు వింతవింతగా మెసేజ్‌లు చేస్తుంటారు. సారీ, బాధపడకు, అంతా ఓకే అయిపోతుంది అంటుంటారు. అరే.. నేను చనిపోలేదు. ఓదార్పు మెసేజ్‌లు పెట్టకండి’’ అంటూ తన స్టైల్‌లో దీనికి కాస్త కామెడీ కూడా యాడ్ చేశాడు అక్షయ్ కుమార్.

ఇదే చేస్తుంటా..

‘‘ఒక జర్నలిస్ట్ అయితే బాధకండి, మీరు కచ్చితంగా కమ్ బ్యాక్ ఇస్తారు అని రాశాడు. నేను వెంటనే తనకు ఫోన్ చేశాను. అసలు నువ్వు ఎందుకిలా రాస్తున్నావు. బ్యాక్ రావాలి అంటే నేను అసలు ఎక్కడికి వెళ్లాను. నేను ఇక్కడే ఉన్నాను. పనిచేస్తూనే ఉన్నాను. ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటాను. ఎవరు ఏమన్నా కూడా పొద్దునే లేస్తాను, వ్యాయామం చేస్తాను, పనికి వెళ్తాను, తిరిగి ఇంటికి వస్తాను. ఏదైతే సంపాదిస్తున్నానో.. అది నా కష్టంతో సంపాదిస్తున్నాను. ఎవరినీ ఎప్పుడూ ఏదీ అడుక్కోలేదు. నన్ను కాల్చి చంపేవరకు నేను పనిచేస్తూనే ఉంటాను’’ అని క్లారిటీ ఇచ్చాడు అక్షయ్ కుమార్.

కామెడీతో హిట్ ఖాయం..

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘ఖేల్ ఖేల్ మే’ మూవీ ఆగస్ట్ 15న విడుదలకు సిద్ధమయ్యింది. ఇందులో తనకు జోడీగా వాణీ కపూర్ నటించింది. ఎన్నో ప్యాన్ ఇండియా చిత్రాల మధ్య ఈ కామెడీ మల్టీ స్టారర్ మూవీ విడుదల కానుంది. తాజాగా విడుదలయిన ఈ మూవీ ట్రైలర్‌తోనే ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేశాడు దర్శకుడు ముదాస్సర్ అజీజ్. ఇక ఇందులో అక్షయ్ కుమార్, వాణీ కపూర్‌తో పాటు ఆమ్మీ వీర్క్ - తాప్సీ పన్ను, ఫర్దీన్ ఖాన్, ఆదిత్య సీల్ - ప్రగ్యా జైస్వాల్ కూడా లీడ్ రోల్స్‌లో నటించారు.

Also Read: ‘ఖేల్ ఖేల్ మే’ ట్రైలర్ విడుదల - ఈ గేమ్ చాలా డేంజర్, కపుల్స్ మాత్రం అస్సలు ఆడొద్దు!

Continues below advertisement
Sponsored Links by Taboola