నవ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) కథానాయకుడిగా విక్రమ్ కె. కుమార్ (Vikram K Kumar) దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'థాంక్యూ'. తొలుత జూలై 8న విడుదల చేయాలనుకున్నారు. అయితే... ఇప్పుడు రిలీజ్ డేట్ మారింది. జూలై 8న కాకుండా జూలై 22న (Thank You New Release Date) సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు నేడు చిత్ర బృందం వెల్లడించింది.


నాగ చైతన్య సరసన రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ కథానాయికలుగా నటించిన 'థాంక్యూ' సినిమాకు బీవీఎస్ రవి కథ అందించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.


Also Read : 'సమ్మతమే' రివ్యూ: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ఎలా ఉందంటే?


అక్కినేని కుటుంబంలో మూడు తరాల హీరోలు కలిసి నటించిన క్లాసిక్ హిట్ 'మనం' తర్వాత చైతన్య, విక్రమ్ కె కుమార్ కలిసి చేస్తున్న చిత్రమిది. ''ఆల్రెడీ విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. 'మారో...', 'ఏంటో ఏంటేంటో...' పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి'' అని చిత్ర బృందం పేర్కొంది. లెజండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ (S Thaman) స్వరాలు సమకూరుస్తున్నారు.


Also Read : చోర్ బజార్ సినిమా రివ్యూ: బచ్చన్ సాబ్‌గా ఆకాష్ పూరి మెప్పించాడా? లేదా?