Akhil Akkineni New look : అక్కినేని అఖిల్ చివరగా 'ఏజెంట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత ఏడాది ఏప్రిల్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అఖిల్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ ఈ సినిమాకి పెట్టారు. అంతేకాదు సుమారు రెండు సంవత్సరాల పాటు ఈ సినిమా కోసం అఖిల్ ఎంతగానో శ్రమించాడు. కానీ అఖిల్ పడ్డ కష్టం అంతా వృథా అయిపోయింది. 'ఏజెంట్' రిజల్ట్ తో బాగా అప్సెట్ అయిన అఖిల్ గత కొంతకాలంగా బయట ఎక్కడా కనిపించడం లేదు. ఆ మధ్య 'సలార్' సక్సెస్ పార్టీలో మెరిసిన ఈ హీరో తాజాగా షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చాడు. దీంతో అఖిల్ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఎయిర్ పోర్ట్ లో షాకింగ్ లుక్ తో కనిపించిన అఖిల్
అఖిల్ ఇటీవల తన బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఫారిన్ వెళ్ళిన విషయం తెలిసిందే. ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 8న తన పుట్టినరోజు వేడుకలను జరుపుకొని తాజాగా హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ క్రమంలోనే అఖిల్ ఎయిర్ పోర్ట్ నుంచి బయటికి వస్తున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో అఖిల్ పొడవాటి జుట్టు, భారీ గడ్డంతో సరికొత్త లుక్ లో కనిపించాడు. ఆ లుక్ చూసి అక్కినేని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ఇప్పటిదాకా అఖిల్ ఇలాంటి లుక్ లో కనిపించకపోవడంతో కొంతమంది అయితే అఖిల్ ఏంటి ఇలా అయిపోయాడు అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. దీంతో అఖిల్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ అవుతుంది.
అఖిల్ న్యూ లుక్ అందుకోసమేనా?
ప్రెజెంట్ సోషల్ మీడియాలో అఖిల్ న్యూ లుక్ పై పెద్ద ఎత్తున చర్చలు స్టార్ట్ అయ్యాయి. అయితే అఖిల్ తన కొత్త సినిమా కోసం ఈ లుక్ ని మైంటైన్ చేస్తున్నాడని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు తో అఖిల్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కంప్లీట్ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని ఇదివరకే వార్తలు వినిపించాయి. ఇప్పుడు అఖిల్ ఇలా పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో కనిపించడంతో పీరియాడికల్ మూవీ కావడంతోనే అఖిల్ ఇలాంటి లుక్ ని మైంటైన్ చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. మరి అఖిల్ న్యూ లుక్ తన కొత్త సినిమా కోసమేనా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.
UV క్రియేషన్స్ నిర్మాణంలో
అఖిల్ కొత్త ప్రాజెక్ట్ ని అగ్ర నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం నిర్మాతలు ఏకంగా 100 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం. 'ఏజెంట్' లాంటి డిజాస్టర్ తర్వాత అఖిల్ తో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు UV క్రియేషన్స్ నిర్మాతలు ముందుకు రావడం విశేషం. ఈపాటికే సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. త్వరలోనే ఈ ప్రాజెక్టును అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.
Also Read : సుజిత్ - నాని మూవీలో హీరోయిన్ ఫిక్స్