Kartikeya 8 Update: కొంతమంది యంగ్ హీరోలు కెరీర్ మొదట్లోనే బ్లాక్‌బస్టర్ హిట్లను ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. కానీ కొంతకాలం తర్వాత ఆ హిట్ ట్రాక్‌ను నిలబెట్టుకోలేక కష్టపడతారు. అలాంటి యంగ్ హీరోల్లో కార్తికేయ గుమ్మకొండ కూడా ఒకరు. కార్తికేయ పేరు చెప్పగానే చాలామందికి ‘ఆర్ఎక్స్ 100’ సినిమానే గుర్తొస్తుంది. ఆ తర్వాత కూడా తను పలు చిత్రాల్లో నటించిన ‘ఆర్ఎక్స్ 100’లాంటి పెద్ద హిట్‌ను అందుకోలేకపోయాడు. అందుకే కాస్త స్పీడ్ తగ్గించి ఏడాదికి ఒక్క చిత్రంతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక రంజాన్ సందర్భంగా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై అప్డేట్‌ను అందించాడు.
ఫుల్ స్పీడ్‌లో యాక్షన్..
కార్తికేయ ఇప్పటివరకు 7 సినిమాల్లో హీరోగా నటించగా.. తన కెరీర్‌లో 8వ సినిమాకు సిద్ధమవుతున్నాడు. రంజాన్ సందర్భంగా దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ అప్డేట్‌ను అందించాడు. కార్తికేయ 8కు సంబంధించిన ఫస్ట్ లుక్.. ఏప్రిల్ 12న మధ్యాహ్నం 12.06 గంటలకు విడుదల అవుతుందని ప్రకటించాడు. ‘ఫుల్ స్పీడ్‌లో యాక్షన్, ఎమోషన్స్ కలిపిన థ్రిల్లింగ్ రైడ్‌కు సిద్ధమవ్వండి’ అంటూ తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇచ్చాడు కార్తికేయ. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీతో ప్రశాంత్ చంద్రపు అనే యంగ్ డైరెక్టర్.. టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా..
కార్తికేయ 8లో ‘హ్యాపీ డేస్’ ఫేమ్ టైసన్ అలియాస్ రాహుల్ దయాకిరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ‘స్పై’ మూవీ ఫేమ్ ఐశ్వర్య మీనన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ చంద్రపు.. సుజీత్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. సుజీత్ డైరెక్ట్ చేసిన రెండు సినిమాలకు ప్రశాంతే అసిస్టెంట్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు తానే స్వయంగా దర్శకుడిగా మారి యంగ్ హీరో కార్తికేయతో యాక్షన్ సినిమాను ప్లాన్ చేశాడు. ఇక కొన్నాళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న కార్తికేయ.. ఈ చిత్రంతో అయినా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని కోరుకుంటున్నాడు. హీరోగా లక్ కలిసి రాకపోవడంతో మధ్యలో విలన్‌గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు కార్తికేయ.
విలన్‌గా గుర్తింపు..
ముందుగా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’లో మొదటిసారి విలన్‌గా కనిపించాడు కార్తికేయ. హీరోకంటే విలన్ పాత్రల్లోనే తను మరింత స్టైలిష్‌గా కనిపిస్తున్నాడని ప్రేక్షకుల దగ్గర నుండి ప్రశంసలు కూడా అందుకున్నాడు. అందుకే తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వాలిమై’ చిత్రంలో విలన్‌గా నటించే అవకాశం కార్తికేయను వెతుక్కుంటూ వచ్చింది. అందులో కూడా విలన్‌గా తనకు మంచి మార్కులు పడ్డాయి. కార్తికేయ చివరిగా.. ‘బెదురులంక 2012’తో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ చిత్రం యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక హీరోగా తన 8వ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూడడం మొదలుపెట్టారు.
Also Read: టైం వచ్చేసింది, 'వార్ 2' సెట్‌లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్ - ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి గ్లోబల్ స్టార్