Akhil Akkineni Reaction About Nick Name In Lenin Pre Release Event : అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ రూరల్ మాస్ ఎంటర్టైనర్ 'లెనిన్' జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తిరుపతిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక, ఇదే ఈవెంట్‌లో ఫ్యాన్స్ ఆయనకు కొత్త పేరు పెట్టారు.
అయ్యగారు కాదు
హీరో అఖిల్‌ను ఫ్యాన్స్ అంతా 'అయ్యగారు' అంటూ సరదాగా పిలుస్తుంటారు. అయితే, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫ్యాన్స్ ఆయనకు కొత్త పేరు పెట్టారు. యాంకర్ సుమ ఓ అభిమానిని ప్రశ్నించగా... నాగ అఖిల్ అని అన్నారు. 'నాగ అఖిల్ అంటే నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ, నాగేశ్వరరావులో నాగ, అన్నపూర్ణమ్మలో అ. నాగార్జున, అమల పేర్లను అందులో చూసుకోవచ్చు. ఇక నుంచి ఆయన ప్రతీ మూవీకి డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది.' అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
'ముఖం చూపించలేకపోతున్నా'
సినిమాలకు చాలా గ్యాప్ వచ్చిందని... అందుకే ఫ్యాన్స్‌కు ముఖం చూపించలేకపోతున్నట్లు చెప్పారు అఖిల్. 'గ్యాప్ వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది. రెండున్నరేళ్లుగా అందరితో కమ్యూనికేట్ చేయలేకపోతున్నా. ఇది నిజాయితీగా అంగీకరించాల్సిందే. లెనిన్ వెనుక ఒకటే ఉద్దేశం ఉంది. నేను మీ ఇంటి వాడిని అయిపోవాలి. ఆ ప్రయత్నమే ఈ సినిమా. రెండేళ్ల క్రితం నందు అద్భుతమైన కథ చెప్పాడు. ఇది నా కథ అని నాకు అనిపించింది. ఈ మూవీతో అందరికీ ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్. ఈసారి జులై 10న సినిమా మాట్లాడుతుంది.' అని అన్నారు.
నాన్న గారి ఊరిలో...
అఖిల్ ఇప్పటివరకూ అర్బన్ స్టోరీస్ చేశాడని... మరి ఈ విలేజ్ స్టోరీకి సెట్ అవుతాడా? అని కాస్త భయపడినట్లు చెప్పారు కింగ్ నాగార్జున. 'ఈ సినిమా చూశాక నాతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. అఖిల్ లెనిన్‌గా మారిపోయాడు. స్టోరీ చెప్పినప్పుడు శ్రీరామపురంలో జరిగిన కథ అని నందు చెప్పాడు. అది నాన్న గారు పుట్టిన ఊరు. అందుకే కథకు వెంటనే కనెక్ట్ అయ్యా. ఈ సినిమాలో ట్విస్టులు ఎవరూ ఊహించలేరు. సెకండాఫ్‌లో అలాంటి ట్విస్ట్స్ వస్తాయి. భాగ్యశ్రీ కోసం ఎన్ని యుద్ధాలైనా చెయ్యొచ్చు. జులై 10కి వస్తున్నాం. మనవాడు కొడుతున్నాడు.' అని అన్నారు.
ఈ మూవీకి వినరో భాగ్యము విష్ణుకథ ఫేం మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించగా... అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. శివాజీ, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరి తదితరులు కీలకపాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్‌పై నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. జులై 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
