Actress Sanjana Telugu Debut Serial Ye Devi Varamo Premiere Details : హీరోయిన్, బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెరపై ఎంట్రీ ఇస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, తల్లీకూతుళ్ల సెంటిమెంట్ ప్రధానాంశంగా రూపొందించిన సరికొత్త సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమో ఆకట్టుకుంటోంది.
ప్రైమ్ టైమ్‌లో...
ఇప్పటికే విభిన్న కథాంశాలతో కూడిన సీరియళ్లతో బుల్లితెర ఆడియన్స్‌ను అలరిస్తున్న 'స్టార్ మా' (Star Maa)లో ప్రైమ్ టైమ్‌లో ఈ సీరియల్ టెలికాస్ట్ కానుంది. సోమవారం (జులై 6) నుంచి ప్రారంభం కానుండగా... శనివారం వరకూ ప్రతీ రోజూ రాత్రి 8:30 గంటలకు ప్రీమియర్ కానుంది. కొత్త సీరియల్ రాకతో టాప్ ట్రెండింగ్ సీరియల్స్ టైమింగ్స్ ఛేంజ్ కానున్నాయి. 'ఇంటింటి రామాయణం' సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి... 'నిండు మనసులు' మధ్యాహ్నం 2:30 గంటలకు టెలికాస్ట్ కానుంది.
Also Read : Aamir Khan : ప్రియురాలితో ఆమిర్ ఖాన్ మూడో వివాహం - ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితుల మధ్య సింపుల్‌గా...
కన్నడకు చెందిన హీరోయిన్ సంజన గల్రానీ 2005లో సోగ్గాడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ప్రభాస్ 'బుజ్జిగాడు'లో హీరోయిన్ చెల్లెలిగా నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. ఆరోగ్య సమస్యలు, పెళ్లి, పిల్లలు... ఇలా పలు కారణాలతో కెరీర్ పరంగా గ్యాప్ తీసుకున్నారు. రీసెంట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మెరిశారు. తనదైన గేమ్‌తో అలరించారు. ఇప్పుడు సీరియల్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
'ఏ దేవి వరమో నీవు' కథేంటంటే?
తల్లీ కూతుళ్ల సెంటిమెంట్ ప్రధానాంశంగా ఈ సీరియల్ సాగనున్నట్లు ప్రోమోను బట్టి తెలుస్తోంది. సమాజంలో పేరు, డబ్బున్న వ్యక్తి కూతురు గీతాంజలి. ప్రేమికుడు మోసం చేయడంతో ఓ ఆడబిడ్డకు జన్మనిస్తుంది. అయితే, ఈ విషయం తెలిస్తే సొసైటీలో పరువు, ప్రతిష్టల ఎక్కడ మంటగలిసి పోతాయో అని భయపడిన ఆమె తండ్రి... పాపను వారసురాలిగా అంగీకరించేందుకు నిరాకరిస్తాడు. పుట్టిన వెంటనే తల్లి కళ్లు తెరవక ముందే పాపను అనాథాశ్రమంలో వదిలేస్తాడు.
పుట్టిన వెంటనే బిడ్డ చనిపోయిందని గీతాంజలిని నమ్మిస్తారు. అనాథగా పెరిగిన చిన్నారి పెద్దదై పాతికేళ్ల తర్వాత మళ్లీ తల్లి ఇంటికే చేరుకోవాల్సి వస్తుంది. అనాథగా ఆ పాప పడిన ఇబ్బందులు తీరి అమ్మ ప్రేమకు దగ్గరవుతుందా? అసలు కన్న కూతురిని గీతాంజలి గుర్తు పడుతుందా? అమ్మ ప్రేమ కోసం ఆరాటపడే ఆ అమ్మాయికి తల్లి ప్రేమ దక్కుతుందా? కాలం తల్లీకూతుళ్లను ఒక్కటి చేసిందా? అనేది తెలియాలంటే సీరియల్ చూడాల్సిందే.
