అఖిల్ అక్కినేని (Akhil Akkineni) కథానాయకుడిగా ప్రభాస్ హోమ్ బ్యానర్ యువి క్రియేషన్స్ ఓ భారీ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. 'సాహో' చిత్రానికి దర్శకత్వ శాఖలో పని చేసిన అనిల్ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఆయన అఖిల్ క్లోజ్ ఫ్రెండ్ అని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగులో జరుగుతున్నాయని తెలిసింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... సినిమా టైటిల్ ఫిక్స్ చేశారట!


'ధీర'గా అఖిల్ అక్కినేని!
Akhil 6 Movie : కథానాయకుడిగా అఖిల్ ఆరో చిత్రమిది. దీనికి 'ధీర' టైటిల్ ఫిక్స్ చేశారని తెలిసింది. దీనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కన్నడ రాక్ స్టార్ యశ్ పాటలకు ఓ కనెక్షన్ ఉంది. అది ఏమిటంటే... 


రామ్ చరణ్ మొదటి బ్లాక్ బస్టర్ సినిమా 'మగధీర'. అందులో చరణ్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ మీద 'ధీర ధీర ధీర... మనసాగలేదురా' అంటూ ఓ పాటను తెరకెక్కించారు జక్కన్న రాజమౌళి. యశ్ పాన్ ఇండియా స్టార్ కావడానికి కారణమైన 'కెజిఎఫ్' సినిమాలో హీరోయిజం ఎలివేట్ చేసేలా 'ధీరా ధీరా ధీరా...' అంటూ ఓ పాట ఉంది. ఇప్పుడు ఆ పాటల్లో హుక్ వర్డ్ 'ధీర' అఖిల్ సినిమా టైటిల్ అవుతుందని తెలిసింది. 


Also Read : విజయ్ దేవరకొండ బర్త్‌డే గిఫ్ట్ - 'ఖుషి'లో తొలి పాట వచ్చేసిందోచ్!
  
అఖిల్ జోడీగా జాన్వీ కపూర్!?
అఖిల్, యువి క్రియేషన్స్ సినిమాలో కథానాయికను కన్ఫర్మ్ చేశారని టాక్. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) అఖిల్ సరసన నటించనున్నారట. ఆల్రెడీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో జాన్వీ నటిస్తున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత తెలుగులో ఆమె నటించబోయే సినిమా ఇదేనని సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.


'ఏజెంట్' ఫ్లాప్ టాక్ & ట్రోల్స్!
అఖిల్ ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన 'ఏజెంట్' సినిమాకు మొదటి ఆట నుంచి విపరీతమైన నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్, వక్కంతం వంశీ కథపై విమర్శలువచ్చాయి. సిక్స్ ప్యాక్ చేసి, హెయిర్ పెంచి అఖిల్ చాలా కష్టపడినప్పటికీ... సరైన ఫలితం రాలేదు. ఫ్లాప్ టాక్ ఒక వైపు చిత్ర బృందాన్ని ఇబ్బంది పెడుతుంటే.... మరో వైపు దారుణమైన ట్రోల్స్ అంత కంటే ఎక్కువ బాధను కలిగించాయని చెప్పుకోవాలి. అమల అక్కినేని ట్రోల్స్ మీద రియాక్ట్ కావడానికి కారణం కూడా అదే అయ్యి ఉంటుంది. 


Also Read 'బ్రో' అంటున్న మామా అల్లుళ్లు - పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ ఇదే!


'ఏజెంట్' ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 37 కోట్ల రూపాయలు. థియేటర్లలో అంత కలెక్ట్ చేయడం కష్టమేనని రెండో రోజుకు ట్రేడ్ వర్గాలకు అర్థమైంది. 'ఏజెంట్' మొదటి రోజు గ్రాస్ తొమ్మిది కోట్ల రూపాయల లోపే ఉంది. రెండో రోజు కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. మూడో రోజుకు నష్టాల్లోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో అఖిల్ సినిమా అంటే ధైర్యంగా భారీ బడ్జెట్ పెట్టే నిర్మాతలు ఉన్నారా? వంటి ప్రశ్నలు కూడా వచ్చాయి. యువి క్రియేషన్స్ సినిమాతో ఆ సందేహాలకు చెక్ పడే అవకాశం ఉంది.