పవర్‌ఫుల్ డైలాగులకు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పెట్టింది పేరు. అందులోనూ బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu)తో ఆయన సినిమా అంటే ఆ డైలాగులు మరింత పవర్ యాడ్ అవుతుంది. వాళ్ళిద్దరి కలయికలో తాజా సినిమా 'అఖండ 2 తాండవం' (Akhanda 2 Thaandavam) టీజర్‌లో డైలాగ్ వింటే ఆ మాటే చెబుతారు.
సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో...'అఖండ 2'లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. 'అఖండ' చూస్తే గనుక ఆ రెండు పాత్రలు తెలుస్తాయి. ఒకటి అఘోర పాత్ర అయితే... మరొకటి మురళీ కృష్ణ రోల్. ఈ సినిమా నుంచి 'బ్లాస్టింగ్ రోర్' పేరుతో విడుదలైన లేటెస్ట్ టీజర్ చూస్తే... మురళీకృష్ణ గెటప్ చూపించారు.
'సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో... దేనికి నవ్వుతానో, దేనికి నరుకుతానో నాకు కూడా తెలియదు కొడకా! ఊహకు కూడా అందదు' అంటూ విలన్‌కు బాలయ్య మాస్ వార్నింగ్ ఇచ్చారు. యాక్షన్ సీన్ మధ్యలో చెప్పే డైలాగ్ అని అర్థం అవుతోంది. ఆయన లుక్ కూడా బావుంది. మాస్ సన్నివేశానికి కావలసినట్టు సంగీత సంచలనం ఎస్ తమన్ నేపథ్య సంగీతం అందించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో టీజర్ విడుదల చేశారు. ఐదు భాషల్లో సినిమా విడుదల కానుంది. బాలకృష్ణ మొదటి పాన్ ఇండియా రిలీజ్ ఇది.
Also Read: మేనేజర్ మహేంద్ర మాకొద్దు... ఎందుకీ పబ్లిక్ పోస్టులు... స్టార్స్ వెనుక ఏం జరిగింది?
డిసెంబర్ 5న సినిమా విడుదలAkhanda 2 Thandavam Release Date: డిసెంబర్ 5న థియేటర్లలోకి 'అఖండ 2' సినిమా రానుంది. బాలకృష్ణ చిన్న కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్.
Also Read: బైసన్ రివ్యూ: కబడ్డీ, కుల వివక్ష నేపథ్యంలో విక్రమ్ కుమారుడి సినిమా - హిట్టా? ఫట్టా?