Aishwarya Rai Bachchan At Cannes Film Festival: ఎన్నో ఏళ్లుగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని రెడ్ కార్పెట్‌పై నడుస్తున్న నటీనటులు ఉన్నారు. అలాంటి ఇండియన్ సెలబ్రిటీల్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా ఒకరు. 2002 నుంచి ఐశ్వర్య రాయ్ రెగ్యులర్‌గా కేన్స్ రెడ్ కార్పెట్‌పై అలరిస్తూనే ఉంది. ఇప్పటివరకు దాదాపు ప్రతీ లుక్‌లో ఐశ్వర్య అదరగొట్టేసిందని ఫ్యాన్స్ అంటుంటారు. అలాగే తాజాగా ఒక బ్లాక్ అండ్ వైట్ గౌన్‌లో కేన్స్ రెడ్ కార్పెట్‌పై నడిచింది ఈ మాజీ విశ్వసుందరి. ఆ గౌన్ చాలా అందంగా ఉందంటూ నెటిజన్లు ప్రశంసించారు. కానీ తన సెకండ్ లుక్‌కు మాత్రం మిక్స్‌డ్ రివ్యూలు వస్తున్నాయి. కొందరు ఈ డ్రెస్‌ను బాగుందంటే.. మరికొందరు మాత్రం ఈ డ్రెస్‌పై తీవ్రమైన విమర్శలు కురిపిస్తున్నారు.
ఒకరే డిజైనర్..
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్ ఓటీటీ రెండో రెడ్ కార్పెట్ లుక్ గురించే నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ‘కింగ్స్ ఆఫ్ కైండ్‌నెస్’ స్క్రీనింగ్‌కు సిల్వర్, బ్లూ కలర్ కాంబినేషన్‌లోని గౌన్‌ను ధరించింది ఐశ్వర్య. ఫ్యాన్స్ అంతా ఈ గౌన్ చాలా బాగుంది అంటుంటే.. కొందరు మాత్రం ఈ లుక్‌పై మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. డెకరేషన్‌లో ఉపయోగించే పినాటాతో డ్రెస్ తయారు చేయించుకుంది అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇది మీ హోమ్ పార్టీ నుంచి తెచ్చుకున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. కేన్స్‌లో తను మొదటి ధరించిన బ్లాక్ అండ్ వైట్ గౌన్‌ను డిజైన్ చేసిన ఫాల్గునీ షేన్ పీకాక్.. ఈ రెండో గౌన్‌ను కూడా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.
ఫ్యాన్స్ సపోర్ట్..
కొందరు నెటిజన్లు.. ఒకప్పుడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐశ్వర్య రాయ్ ఎలా హాజరయ్యేదో, ఇప్పుడు ఎలా హాజరవుతుందో పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు కేన్స్ రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య నడుస్తుంటే అందరూ తననే చూసేవారని, ఇప్పుడు తన వింటేజ్ లుక్ కోల్పోయిందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐశ్వర్య రాయ్ గౌన్ మాత్రమే కాదు.. తన ఫేస్ కూడా చాలా మారిపోయిందంటూ కొందరు బాడీషేమింగ్ చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఐశ్వర్యకు సపోర్ట్‌గా నిలబడుతున్నారు. అప్పటికీ, ఇప్పటికీ ఐశ్వర్య బ్యూటీ ఏం మారలేదని ప్రశంసిస్తున్నారు. తనలాగా ఇంకెవరూ బ్యూటీని క్యారీ చేయలేరని అంటున్నారు.
Also Read: అతడి కలలే నా కలలు - శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై తొలిసారి నోరు విప్పిన జాన్వీ కపూర్