Airbnb Icons: ప్రపంచంలోనే హోటల్ బుకింగ్స్‌లో, లగ్జరీ స్టేను ఏర్పాటు చేసే విషయంలో టాప్ వెబ్‌సైట్‌గా గుర్తింపు దక్కించుకుంది ఎయిర్ బీఎన్‌బీ. ఒక్కరోజు ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు లగ్జరీగా ఉండాలి అనుకునే వారికోసం ఎయిర్ బీఎన్‌బీ దగ్గర వేలల్లో ఆప్షన్లు ఉంటాయి. అయితే ఇండియాలో ఎయిర్ బీఎన్‌బీ.. తన పాపులారిటీని పెంచుకోవడం కోసం మరో వినూత్న ఐడియాతో ముందుకొచ్చింది. అయితే సెలబ్రిటీ హోమ్ స్టే. ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొందరు సెలబ్రిటీలను సెలక్ట్ చేసి వారి ఇంట్లో గెస్టులు ఒకరోజు గడిపే అవకాశాన్ని కల్పిస్తోంది ఎయిర్ బీఎన్‌బీ.


జాన్వీ కపూర్‌తో పాటు..


ఇప్పటికే జాన్వీ కపూర్ చెన్నై ఇంటిని ఎయిర్ బీఎన్‌బీలో అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని స్వయంగా ఎయిర్ బీఎన్‌బీనే వెబ్‌సైట్ ద్వారా ప్రకటించింది. ఒకప్పుడు శ్రీదేవి ఉన్న ఆ ఇంటిని ఇప్పుడు జాన్వీ కపూర్.. ఎయిర్ బీఎన్‌బీ గెస్టుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. జాన్వీ కపూర్ మాత్రమే కాదు.. ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ లాంటి వారు కూడా తమ ఇంటిని హోమ్ స్టే కోసం ఎయిర్ బీఎన్‌బీలో అందుబాటులో ఉంచారు. సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు.. మీమ్ కంటెంట్‌తో ఫేమస్ అయిన ఖ్యాబీ లేమ్ కూడా తన ఇంటిని ఎయిర్ బీఎన్‌బీ గెస్టుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చాడు.






షారుఖ్, యువరాజ్ కూడా..


సౌత్ ఢిల్లీలోని తన ప్రాపర్టీని హోమ్ స్టే కోసం గెస్టులకు అందించాలని షారుఖ్ ఖాన్ 2020లోనే నిర్ణయించుకున్నారు. అప్పుడే తనకు ఎయిర్ బీఎన్‌బీతో ఒప్పందం కూడా జరిగింది. సౌత్ ఢిల్లీలోనే పంచశీల పార్క్ ప్రాంతంలో ఉన్న షారుఖ్ ఖాన్ ఇంట్లో తన కుటుంబానికి సంబంధించిన చాలా జ్ఞాపకాలు దాగి ఉన్నాయి. ఆ ఇంట్లోని ప్రతీ విషయాన్ని షారుఖ్ భార్య గౌరీ ఖానే డిజైన్ చేశారు. మాజీ ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా గోవాలో ఉన్న తన ఇంటిని ఎయిర్ బీఎన్‌బీ గెస్టుల కోసం అందుబాటులో ఉంచాడు. ఆ ఇంటి పేరు కాసా సింగ్. ఇది ఒక హిల్‌టాప్‌పై నిర్మించడంతో గోవాలోని బెస్ట్ వ్యూను అందిస్తుంది ఈ హోమ్ స్టే.


జైపూర్ రాయల్ ప్యాలెస్..


జైపూర్‌కు చెందిన రాయల్ ఫ్యామిలీ కూడా మొదటిసారి ఎయిర్ బీఎన్‌బీ హోస్టులుగా మారారు. జైపూర్‌లోని ది సిటీ ప్యాలెస్ అనేది ఎంత రాయల్‌గా ఉంటుంది అని చాలామందికి తెలుసు. అందులో ఒక్కరోజు అయినా గడపాలి అనుకునే ఎయిర్ బీఎన్‌బీ గెస్టుల కోరిక ఫైనల్‌గా తీరనుంది. ఇప్పుడు జైపూర్ సిటీ ప్యాలెస్ కూడా ఎయిర్ బీఎన్‌బీ గెస్టుల కోసం అందుబాటులో ఉంటుంది. ఇక ఎయిర్ బీఎన్‌బీ అందిస్తున్న ఇంటర్నేషనల్ ప్రాపర్టీల విషయానికొస్తే.. చికాగోలోని హోమ్ ఎలోన్, మలిబూలో ఉన్న బార్బీ మలిబూ డ్రీమ్ హౌజ్, స్కాట్‌ల్యాండ్‌లోని ష్రెక్ స్వాంప్, డాన్వెర్స్‌లోని హోకస్ పోకస్, మలిబులోని మిస్టరీ మెషీన్ కూడా గెస్టుల కోసం అందుబాటులోకి వచ్చాయి.



Also Read: జాన్వీ కపూర్ బంపర్ ఆఫర్ - శ్రీదేవి ఇంట్లో ఉండేందుకు అరుదైన అవకాశం, మీరు సిద్ధమేనా?