మెగా మేనల్లుడు సాయిధరమ్ నటించిన విరూపాక్ష , అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన 'ఏజెంట్' రెండు సినిమాలు ఒకే రోజు ఓటీటీ లో సందడి చేయబోతున్నాయి. ఇక వాటి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాయిధరమ్ తేజ్ రీసెంట్ గా నటించిన 'విరూపాక్ష' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏప్రిల్ 21న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత BVSN ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ ఎంతో కష్టపడి చేసిన సినిమా ఇది. హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.


సుకుమార్ అందించిన స్క్రీన్ ప్లే సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ సినిమాకి ఎంతో బాగా వర్క్ అవుట్ అయ్యాయి. దీంతో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తిచేసుకుని లాభాల బాట పట్టింది. అంతేకాదు సాయిధరమ్ తేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా 'విరూపాక్ష' నిలిచింది. ఇక ఈ సినిమాని థియేటర్లో మిస్సయిన ఆడియన్స్ అంతా ఓటిటి రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా విరూపాక్ష ఓటిటికి నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లెక్స్ ఈ సినిమాని భారీ రేట్ కి కొనుగోలు చేయగా మే 21 ఆదివారం నుండి 'విరూపాక్ష' నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మే18 అర్ధరాత్రి 12 గంటల నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు.


అలాగే ఈ సినిమాతో పాటు అక్కినేని యంగ్ హీరో అక్కినేని నటించిన 'ఏజెంట్' మూవీ కూడా అదేరోజు అర్ధరాత్రి ప్రముఖ ఓటీటీ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. 'విరూపాక్ష', 'ఏజెంట్' రెండు ఒకేసారి ఓటిటిలో స్ట్రీమింగ్ అవ్వబోతుండడంతో ఓటీటీ లవర్స్ కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. కాగా 'విరూపాక్ష', 'ఏజెంట్' రెండు సినిమాల్లో 'విరూపాక్ష' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకోగా.. 'ఏజెంట్' డిజాస్టర్ గా నిలిచింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ సినిమా ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. హిపాప్ తమిళ సంగీతం అందించిన ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా నటించగా.. అలాగే బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రావు ఎలా ఓ స్పెషల్ సాంగ్లో సందడి చేసింది ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాకి కథను అందించారు.


Also Read: 'ఆదిపురుష్' ఓ అద్భుతం - సినిమా చూశాక ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతారు : శరత్ కేల్కర్