Trending
Balakrishna: నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్... 'ఆదిత్య 369' పార్ట్ 2పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలయ్య
Nandamuri Balakrishna : 'ఆదిత్య 369' మూవీ రీరిలీజ్ కు ముందు ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఉగాది రోజు ఏర్పాటు చేసిన ఈ వేడుకలో బాలయ్య 'ఆదిత్య 369' పార్ట్ 2 గురించి అప్డేట్ ఇచ్చారు.
నందమూరి బాలకృష్ణ, తెలుగు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో వచ్చిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'ఆదిత్య 369'. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 4న రిలీజ్ కాబోతోంది. భారతదేశ సినిమా చరిత్రలోనే టైమ్ ట్రావెల్ అనే పాయింట్ తో ఫస్ట్ టైం రూపొందిన ఈ మూవీని ఎస్పీ బాలసుబ్రమణ్యం సమర్పించారు. రీరిలీజ్ సందర్భంగా ఉగాది పర్వదినం రోజు హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో బాలయ్య మాట్లాడుతూ 'ఆదిత్య 369' సీక్వెల్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను షేర్ చేశారు.
8 నెలల కష్టం ఈ రీ రిలీజ్
నందమూరి బాలకృష్ణ 'ఆదిత్య 369' మూవీ రీరిలీజ్ కు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ "అప్పట్లో ప్రతి సినిమాకి వేరియేషన్స్ ఉండేలా ప్రయత్నించాను. దానికి కారణం నా తండ్రి, గురువు, దైవం నందమూరి తారక రామారావు గారు. అప్పట్లోనే ఆయన ఓవైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు డీ గ్లామర్ రోల్స్ కూడా చేశారు. ఆయన స్ఫూర్తితోనే 'భైరవ ద్వీపం' సినిమాలో డీ గ్లామర్ రోల్ చేశాను. అలాగే 'ఆదిత్య 369' సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు పాత్ర పోషించడానికి నాన్నగారే ఇన్స్పిరేషన్. ఈ స్టోరీ పట్టుకొని సింగీతం, కృష్ణ ప్రసాద్, బాలసుబ్రమణ్యం గారు నా దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే ఓకే చెప్పాను. ఇక ఇప్పటికి కూడా ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఏప్రిల్ 4 న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన ఆదరణ దక్కబోతోంది. అన్ని జనరేషన్ల వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా గురించి భారతీయ సినిమా రంగం ఇప్పుడు మరోసారి మాట్లాడుకుంటుంది. నిజానికి ఈ మూవీది ఒకే ఒక్క ప్రింట్ దొరికింది. దాన్ని తీసుకుని ప్రసాద్ ల్యాబ్స్ వాళ్ళు 8 నెలల పాటు ఈ సినిమాను రీస్టోర్ చేశారు. నాతో ఇలాంటి సినిమాలు తీసినందుకు శివలెంక కృష్ణ ప్రసాద్, సింగీతం గార్లకు కృతజ్ఞుడిని. అలాగే ఈ మూవీకి మూల కారణమైన ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి జీవితాంతం రుణపడి ఉంటాను" అన్నారు.
Also Read: ఆదిత్య 369 రీ రిలీజ్... బాలయ్య సినిమాతో ఈ వారం థియేటర్లలోకి వస్తున్న కొత్త సినిమాలు ఏమిటంటే?
'ఆదిత్య 369' సీక్వెల్ అప్డేట్ ఇచ్చిన బాలయ్య
ప్రస్తుతం 'ఆదిత్య 369' మూవీకి సీక్వెల్ కూడా సిద్ధమవుతోంది. నేను సింగీతం శ్రీనివాసరావు కలిసి ఒక్క రాత్రిలోనే కథను సిద్ధం చేశాము. త్వరలోనే దాన్ని మొదలు పెట్టబోతున్నాం" అంటూ సీక్వెల్ త్వరలోనే పట్టాలెక్కబోతోంది అన్న గుడ్ న్యూస్ నందమూరి అభిమానులకు అందించారు బాలయ్య. గతంలో బాలయ్య 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' సీజన్ 4 ఎపిసోడ్ 6లో 'ఆదిత్య 369'కి సీక్వెల్ రాబోతుందని వెల్లడించారు. ఈ మూవీకి 'ఆదిత్య 999 మ్యాక్స్' అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. ఇక ఇందులో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరోగా నటించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేదాకా నందమూరి అభిమానులు 4k డిజిటల్ వెర్షన్ లో రాబోతున్న 'ఆదిత్య 369' మూవీని చూసి ఎంజాయ్ చేయాల్సిందే.