Adipurush Box Office Collections: ‘ఆదిపురుష్‌’కి ఇప్పటివరకూ వచ్చిన హైప్‌ ద్వారా, బుకింగ్‌ల ద్వారా తొలి వారాంతంలో మంచి వసూళ్లు వచ్చాయి. కానీ ప్రస్తుతం పలు కారణాలతో సినిమా కలెక్షన్లు సగానికి పడిపోయాయి. ఈ మూవీ రిలీజైన మొదటి మూడు రోజులు మంచి కలెక్షన్సే వచ్చాయి. అయితే, సోమవారం (జూన్ 19) నుంచి కష్టాలు మొదలయ్యాయి. కలెక్షన్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి.


బాక్సాఫీస్ వద్ద 'ఆదిపురుష్' చిత్రం సాధించిన కలెక్షన్ల విషయానికొస్తే.. ఈ సినిమా ఐదవ రోజున రూ.10+ కోట్లకు వసూళ్లు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.395 కోట్లు వసూలు చేసిందని చిత్రయూనిట్ వెల్లడించింది. కానీ ఏయే భాషల్లో ఎంత కలెక్ట్ చేసిందన్న వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ఇదిలా ఉండగా సినిమా వారాంతంతో పోలిస్తే థియేటర్లలో తక్కువ ఆక్యుపెన్సీ నమోదవుతోంది. అయితే, ఇతర భాషలతో పోలిస్తే, తెలుగు వెర్షన్‌లో కొంత మెరుగైన ఆక్యుపెన్సీ ఉన్నట్టు సమాచారం. ఇది జూన్ 20, 2023న వివిధ ప్రదర్శన సమయాల్లో 20% నుంచి 40% వరకు పెరగడం చెప్పుకోదగిన విషయం. 


సోషల్ మీడియాలో నెగిటివ్ మౌత్ టాక్ కారణంగా సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఫిల్మ్ మేకర్స్ పబ్లిక్ డిమాండ్ చేసే కొన్ని డైలాగ్స్ లో మార్పులు చేసిన తర్వాత మాత్రమే వారాంతంలో సినిమా మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేలా కనిపిస్తోంది. కాగా, ఉత్తరాదిలో ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ సినీ కార్మికులు కూడా నిరసన వ్యక్తం చేయడం గమనార్హం.






‘ఆదిపురుష్’ హిందూ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా తెరకెక్కించారు. ఈ పౌరాణిక యాక్షన్ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజైంది. ఈ చిత్రంలో ప్రభ, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్, దేవదత్తా నాగే తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మొదటి రోజున ఆదిపురుష్ బాక్సాఫీస్ కలెక్షన్‌తో సంచలనం సృష్టించింది. ఊహించని సంఖ్యలో టిక్కెట్‌ల విక్రయాలు జరిగాయి. జూన్ 15న రాత్రికి ముందే 2.5 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. 


'ఆదిపురుష్'.. శ్రీరాముడు, రాక్షస రాజు రావణుడి మధ్య జరిగిన పురాణ యుద్ధం ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందించారు. రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, సీతగా కృతి సనన్ నటించిన ఈ చిత్రం.. 3డి నిర్మాణం, వివిధ భాషలలో విడుదల చేయడంతో భారతీయ సినిమాలో ఒక మైలురాయిని సృష్టిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.


Read Also : Shriya Reddy On OG : పవన్ కళ్యాణ్ సినిమా ఒక్కటీ చూడలేదు, 'ఓజీ'కి ఎందుకు ఓకే చెప్పానంటే? - శ్రియా రెడ్డి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial