పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన 'ఆదిపురుష్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అయింది. జూన్ 16న విడుదల కాబోతున్న ఈ సినిమా టికెట్లు ఇప్పటికే ఫాస్ట్ గా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ లో మొదటి స్థానాన్ని దక్కించుకున్న ఆదిపురుష్ ఇప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ లో రూ.100 కోట్లకు పైగా గ్రాస్ సంపాదించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో మేకర్స్ ఆదిపురుష్ టికెట్ రేట్స్ ని భారీగా పెంచేశారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే సినిమాకి ఈ రేంజ్ లో టికెట్ రేట్స్ ఉండడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు ఇతర ప్రముఖ నగరాల్లో 'ఆదిపురుష్' టికెట్ రేట్స్ సామాన్య ప్రజలు కొనేందుకు వీలులేని స్థాయిలో పెంచేశారు. ప్రముఖ టికెట్ యాప్ బుక్ మై షో నివేదికల ప్రకారం నైజాంలో ఆదిపురుష్ టికెట్ల ధర రూ.245 నుంచి రూ.400 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కేవలం సింగిల్ థియేటర్స్ లోనే కాకుండా ప్రసాద్స్, సినీ ప్లెక్స్, ప్లాటినం, ముక్త వంటి మల్టీప్లెక్స్ లోనూ విడుదలవుతోంది. అయితే ఈ మల్టీప్లెక్స్ లలో టికెట్ ధరలు ఎంతో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. బాలీవుడ్ మూవీ పఠాన్ తర్వాత అన్ని ఫార్మేట్స్ లో 'ఆదిపురుష్' విడుదలవుతోంది. ఇక హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ లో ఆదిపురుష్ టికెట్ ధరలు రూ.400 ( గోల్డ్+3D గ్లాస్ ) నుండి మొదలవుతున్నాయి. హైదరాబాద్ మొత్తంలోనే అత్యంత ఖరీదైన టికెట్ ధరలు ఈ థియేటర్ లోనే ఉన్నప్పటికీ టికెట్స్ మాత్రం హాట్ కేకుల్లాగా అమ్ముడవుతున్నాయి.
సినీ ఫ్లెక్స్ థియేటర్స్ లోను ఇప్పటికే చాలా టికెట్లు అమ్ముడు అయ్యాయి. మిగతా మల్టీప్లెక్స్ లో టికెట్ ధరలు రూ.325(సాధారణ), రూ.325(ఎగ్జిక్యూటివ్), రూ.380(విఐపి)గా ఉన్నాయి. అటు గచ్చిబౌలిలోని ప్లాటినం మూవీ టైం సినిమా థియేటర్లో త్రీడీ సిల్వర్ క్లాస్ టికెట్ ధర రూ.325, నిజాంపేట్ లోని జిపిఆర్ లో కూడా రూ.325 (3d గోల్డ్) రూ.380 (3d సోఫా) చొప్పున విక్రయిస్తున్నారు.
సికింద్రాబాద్లో ఉన్న మూవీ మాక్స్ ఏం ఆర్ లో టికెట్ ధరలు రూ.250 (3d క్లాసిక్)రూ.335 (3d ప్రైమ్) మరియు రూ.390 (3d రిక్లైనర్)గా గా ఉన్నాయి. అయినప్పటికీ ముక్త A2 సినిమాలతో పోలిస్తే ఈ ధరలు చాలా ఎక్కువ. మహాలక్ష్మి కాంప్లెక్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి 70 MM 4కే లేజర్ అండ్ డాల్బీ అట్మాస్లో టికెట్ రేట్లు రూ.130 నుండి రూ.260 వరకు సరసమైన ధరలకే అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ టికెట్ రేట్లను బట్టి చూస్తుంటే ఆదిపురుష్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ ని సొంతం చేసుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సుమారు రూ.500 కోట్లు ఈ మూవీ ఇప్పటికే డిస్టిబూటర్స్ రైట్స్ పరంగా భారీ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఆదిపురుష్ మూవీ ఓటిటి రైట్స్ సుమారు 250 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. వీటితోపాటు సినిమా మ్యూజిక్, శాటిలైట్, ఇతర డిజిటల్ రైట్స్ ద్వారా రూ.432 కోట్ల భారీ బిజినెస్ ని జరుపుకుంది. దీన్నిబట్టి రిలీజ్ కి ముందే ఈ సినిమా బడ్జెట్లో 80 శాతం రికవరీ చేసినట్లు స్పష్టమవుతుంది.
Also Read: తను వచ్చాక చాలా సంతోషంగా ఉన్నా, తమన్నాతో ప్రేమాయణంపై విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్