Adah Sharma New Movie 2024: అదా శర్మ అంటే తెలుగు ప్రేక్షకులకు 'హార్ట్ ఎటాక్' బ్యూటీ. ఆ తర్వాత పలు సినిమాలు చేశారు. మెజారిటీ సినిమాల్లో క్యూట్, స్వీట్, బబ్లీ క్యారెక్టర్లు చేశారు. అయితే... 'ది కేరళ ఫైల్స్' తర్వాత ఆవిడ రేంజ్ మారింది. అందులో సీరియస్ అండ్ ఎమోషనల్ రోల్ చేశారు. పెర్ఫార్మన్స్ చేసే నటిగా పేరు తెచ్చుకున్నారు. 'బస్తర్'తో ఆ ఇమేజ్ మరింత పెరిగింది. ఆవిడ కొత్త సినిమాలపై క్యూరియాసిటీ మొదలు అయ్యింది. ఈ వారం కొత్త సినిమాతో అదా శర్మ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.


మే 24న థియేటర్లలోకి వస్తున్న 'సీడీ'
CD (Criminal Or Devil) Release Date: అదా శర్మ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా తెలుగు సినిమా 'CD' (క్రిమినల్ ఆర్ డెవిల్). ఈ చిత్రానికి కృష్ణ అన్నం దర్శకత్వం వహించారు. ఎస్ఎస్సిఎమ్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. దీనికి గిరిధర్ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్‌. ఈ నెల 24న థియేటర్లలోకి వస్తుందీ సినిమా.


CD (Criminal Or Devil) Movie Movie Genre: 'సీడీ' (క్రిమినల్ ఆర్ డెవిల్) మూవీని డిఫరెంట్ కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచాయి. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్, డ్రామా జానర్ చిత్రమిది. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ వచ్చింది. సినిమా బావుందని సెన్సార్ సభ్యులు ప్రంసించినట్టు తెలిసింది. సెన్సార్ రిపోర్ట్‌ బావుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలుగుతోంది.


Also Readఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగుకు విమర్శకుల నోళ్లూ మూతపడ్డాయంతే!


'ది కేరళ స్టోరీ' తర్వాత అదా శర్మ తెలుగు సినిమా ఏదీ చేయలేదు. ఆ సినిమా టైంలో 'సీడీ' షూటింగ్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలోని థియేటర్లలో సినిమా విడుదల చేస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చేసి ఓటీటీ రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట.


Also Read: గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ డీల్ క్లోజ్... వామ్మో, అజిత్ సినిమాకు రికార్డ్ రేటు వచ్చిందిగా!


'సీడీ' సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్ర పోషిస్తుండగా... యువ హీరో విశ్వంత్ దుద్దుంపూడి, బుల్లితెర నటి 'జబర్దస్త్' రోహిణి, నటుడు భరణి శంకర్ సహా రమణ భార్గవ్, మహేష్ విట్టా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏ.ముద్దు కృష్ణ కథ, సంభాషణలు రాయగా... సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం అందించారు. ఈ చిత్రానికి కూర్పు: సత్య గిడుతూరి, సంగీతం: ఆర్ఆర్ ధృవన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్, నిర్మాణ సంస్థ: ఎస్ఎస్సిఎమ్ ప్రొడక్షన్స్, దర్శకత్వం: కృష్ణ అన్నం.