సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అగ్ర నటీనటులకు అభిమానులు ఉండడం సహజం. తమ అభిమాన నటీనటులపై ఒక్కోసారి ఫ్యాన్స్ చేసే పనులు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఆ అభిమానం హద్దులు దాటితే కొన్నిసార్లు అది ఇబ్బందిగా మారుతుంది. ఫ్యాన్స్ అని చెప్పుకునే కొంతమంది సదరు నటీనటులతో ఒక్కోసారి మితిమీరి ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన మరోసారి బయటపడింది. తాజాగా ఓ మూవీ షూటింగ్లో జరిగిన సంఘటన అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ప్రస్తుత ఆ సంఘటన సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటక చిక్కమగలురులోని ఓ ప్రాంతంలో 'కొరగజ్జ' అనే కన్నడ చిత్రం కోసం పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రీకరణలో భాగంగా నటి శుభం పూంజా తోపాటు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య సెట్ లో ఉన్నారు. అయితే చిత్రీకరణ జరుగుతున్న సమయంలో అక్కడికి బైక్ పై వచ్చిన కొందరు దుండగులు పదునైన ఆయుధాలతో షూటింగ్ ప్రాంతంలోకి చొరబడ్డారు. అంతేకాకుండా ఆ దుండగులు నటి పూజతో అనుచితంగా ప్రవర్తించారని ఆమె చేయి పట్టుకుని లాగేందుకు కూడా ప్రయత్నించారని తెలిసింది. ఈ ఘటనతో షూటింగ్ కూడా నిలిపివేశారట. ఈ ఘటన కుదేముక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినప్పటికీ చిత్ర బృందం దీనిపై అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.
ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు." లక్షల రూపాయలు వెచ్చించి సెట్ ను నిర్మించే ముందు సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతులు తీసుకున్నామని ఇప్పుడు ఈ ఘటనతో పాట చిత్రీకరణను ఆపేసామని" తాజాగా చిత్ర దర్శకుడు సుధీర్ అత్తవర మీడియాకు తెలియజేశారు. ఈ సినిమా బృందం పాట చిత్రీకరణ కోసం బాలీవుడ్ నుండి ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యను కూడా నియమించుకున్నారు. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది? నటి పూంజాతో ప్రవర్తించిన ఆ దుండగులు ఎవరు? ఆమెకు వాళ్లతో సంబంధం ఏంటి? దీని వెనుక కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటన ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా దీనికంటే ముందు కొన్నాళ్ల క్రితం ప్రముఖ మలయాళ నటిని వెంబడించి మార్గమధ్యంలో కిడ్నాప్ చేసిన ఘటన ఎంతటి సంచలమైందో అందరికీ తెలిసిందే. ఈ కేసులో ప్రముఖ హీరో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో అతనిపై విచారణ కూడా సాగింది. ఆ తర్వాత తాజాగా నటి శుభం పూంజా పై జరిగిన ఘటన మరోసారి సినీ వర్గాల్లో సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇక శుభం పూంజా విషయానికొస్తే.. మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈమె పలు కన్నడ, తమిళ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా 'మొగ్గిన మనసు' అనే కన్నడ చిత్రంలో శుభం పూంజా నటనకి మంచి గుర్తింపు వచ్చింది.
Also Read : 'కన్నప్ప' షూటింగ్‌లో ప్రమాదం, మంచు విష్ణుకు గాయాలు!