Actress Renu Desai About Pawankalyan & Children: రేణు దేశాయ్.. హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న 'బ‌ద్రి', 'జానీ' సినిమాల్లో న‌టించారు. ఆ త‌ర్వాత ఆయ‌న్ను పెళ్లి చేసుకుని, కొన్ని కారణాల‌తో విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్, రేణు దేశాయ్ ల‌కి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు వారే అకీరా, ఆద్య‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో విడిపోయిన త‌ర్వాత పిల్ల‌లు ఇద్ద‌రు రేణు దేశాయ్ తోనే క‌లిసి ఉంటున్నారు. అయితే, వాళ్ల గురించి కొన్ని విష‌యాలు పంచుకున్నారు రేణు దేశాయ్. సింగిల్ పేరెంట్ గా త‌ను పిల్ల‌ల్ని పెంచ‌డంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో కూడా చెప్పుకొచ్చారు ఆమె. 


అకీరా, ఆద్య అల్ల‌రి చేస్తారా?  


వాళ్లు ఇద్ద‌రు ఉండ‌టం నాకు అదృష్టం. అసలు అల్ల‌రి చేయ‌రు. వాళ్లు చాలా మెచ్యుర్డ్. ఆద్యకి కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. క్రియేటివ్ గా ఆలోచిస్తుంది బాగా. ఇద్ద‌రు క‌లిసి పియానో వాయిస్తారు. ఆద్యాకు జాలి, ద‌య, క‌రుణ ఎక్కువ‌. సొసైటీ గురించి కూడా చాలా ఎక్కువ ఆలోచిస్తుంది.


సింగిల్ పేరెంట్ గా ట‌ఫ్ అనిపిస్తుందా? 


ఒక్కోసారి ట‌ఫ్ అనిపిస్తుంది. ఇద్ద‌రికీ ఒక్కోసారి హెల్త్ బాలేన‌ప్పుడు ఒక్క‌దాన్ని ఇద్ద‌రిని చూసుకోవాలి. స్కూల్ లో స్పోర్ట్స్ డే అలా అయిన‌ప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. ఒక బేబీ సిక్ అయిన‌ప్పుడు ఇంకొక‌రికి స్కూల్‌లో యాన్యువ‌ల్ డే ఉంటుంది. అలాంటివి ఫేస్ చేయాల్సి వ‌చ్చేది. ఇద్ద‌రికి అటెన్ష‌న్ ఇవ్వాలి. అలాంటివే కొన్ని ట‌ఫ్‌గా అనిపిస్తాయి. ఈ 13 ఏళ్ల‌లో అదే ఇబ్బంది. 


పిల్ల‌ల‌కి ఏమైనా 100 ప‌ర్సంట్ ఇవ్వ‌లేదు అనిపిస్తుందా? 


అలా ఎప్పుడు అనిపించ‌లేదు. కానీ, కొన్నిసార్లు నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. అలాంట‌ప్పుడే చేయ‌లేక‌పోయాను అనిపిస్తుంది. వాళ్ల‌తో కొంచెం చిల్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఫుడ్, నిద్ర‌పోయే విష‌యంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. 7 గంట‌ల‌కు డిన్న‌ర్ చేయాలి, వెంట‌నే ప‌డుకోవాలి. శ‌నివారం, ఆదివారం మాత్రం కొంచెం లీనియ‌న్స్ ఇస్తాను. 


ఆద్య కెరీర్.. ప్లాన్స్ ఏంటి? 


త‌ను చాలా క్లియ‌ర్ గా ఉంది త‌న కెరీర్ గురించి. 2017లోనే ఆద్య డిసైడ్ అయిపోయింది. ఆర్కిటెక్ట్ అవుతాను అని డిసైడ్ చేసుకుంది. సొంత రెస్టారెంట్ పెట్టుకోవాలి అనుకుంది ఆద్య‌. అలా త‌న కెరీర్ గురించి త‌ను డిసైడ్ అయ్యింది. అని త‌న పిల్ల‌ల గురించి చెప్పుకొచ్చారు రేణు దేశాయ్. 


ఇక త‌న కెరీర్ గురించి మాట్లాడుతూ.. "ప్ర‌తి ఒక‌రి రిలేష‌న్ షిప్‌లో, ప్ర‌తి ఒక్క‌రికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్ర‌తి ఒక్క‌రు ఏడుస్తూనే ఉన్నారు. నేనేమీ స్పెష‌ల్ కాదు. నాకు ఒక్క‌దానికి మాత్ర‌మే క‌ష్టాలు ఏమీ లేవు" అని చెప్పారు రేణు దేశాయ్. ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి త‌నను అడ‌గొద్ద‌ని, ఏమైనా మాట్లాడాలంటే త‌న‌ గురించే అడ‌గాల‌ని అన్నారు రేణు దేశాయ్. ప‌వ‌న్ కల్యాణ్ గురించి ఏమీ మాట్లాడినా త‌న గురించి తప్పు రాస్తున్నార‌ని చెప్పారు. మాట్లాడిన దాంట్లో ఇంపార్టెంట్ అంతా ప‌క్క‌న పెట్టి చిన్న చిన్న విష‌యాల‌ను మాత్ర‌మే వైర‌ల్ చేస్తున్నారు అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు రేణు దేశాయ్. 


Also Read: రక్తి నుంచి భక్తికి.. దేశంలోనే తొలి భక్తి ఓటీటీని ప్రారంభిస్తున్న ‘ULLU’ యాప్ యాజమాన్యం