Rashmika Mandanna About Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. ‘పుష్ప’ సినిమా విడుదలైన మూడేళ్లకు, సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మేక్సర్స్ క్రేజీ అప్ డేట్స్ ఇస్తున్నారు. తాజాగా హీరోయిన్ రష్మిక మందన్న ఈ సినిమాకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది.   


ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకెండ్ హాఫ్   


‘పుష్ప 2’ మూవీకి సంబంధించి రష్మిక డబ్బింగ్ షురూ చేసింది. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియోలో తీసిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఇన్ స్టా వేదికగా రెండు ఫోటోలను షేర్ చేసింది. పనిలో పనిగా సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “ఈ సినిమాకు సంబంధించి అసలు విషయం మొదలు పెట్టాల్సిన టైమ్ వచ్చింది. ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. ‘పుష్ప: ది రూల్’ ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ అయిపోయింది. నేను సెకండ్ హాఫ్‌ కు సంబంధించిన డబ్బింగ్ మొదలు పెట్టాను. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కు మించి ఉంటుంది” అంటూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.  


ఎమోషనల్ అయిన రష్మిక


‘పుష్ప 2’ సినిమా గురించి చెప్తూ రష్మిక ఎమోషనల్ అయ్యింది. చాలా బాధగా ఉందని చెప్పుకొచ్చింది. “నాకు ఈ సినిమా గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదు. ప్రేక్షకులు మైండ్ బ్లోయింగ్ ఎక్స్ పీరియెన్స్ కు రెడీగా ఉండండి. నేను కూడా చాలా ఎదురు చూస్తున్నారు. ఈ ఫోటోలో నేను బాధగా ఎక్స్ ప్రెషన్స్ పెట్టడానికి ఓ కారణం ఉంది. ఈ సినిమా షూటింగ్ అయిపోయింది. అందుకే బాధగా అనిపిస్తుంది” అని రాసుకొచ్చింది.  






 ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక


నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ‘పుష్ప’ సినిమా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో శ్రీవల్లి అనే డీ గ్లామర్ పాత్రలో అద్భుతంగా నటించింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఆమె బాలీవుడ్ నుంచి సైతం వరుస ఆఫర్లు వస్తున్నాయి. పాన్ ఇండియన్ హీరోయిన్ గా దుమ్మురేపుతోంది. ఇప్పుడు ‘పుష్ప2’తో మరోసారి అభిమానులను అలరించబోతోంది. ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దేశ వ్యాప్తంగా ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.



పాట్నా వేదికగా ట్రైలర్ విడుదల


‘పుష్ప 2’కు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. నవంబర్ 17న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్ లో సాయంత్రం 5 గంటల నుంచి  ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.  


Read Also: ‘హ్యారీ పోటర్‌’ రేంజ్‌లో ‘ది రాజా సాబ్’, ప్రభాస్ మూవీలో కీ పాయింట్స్ రివీల్ చేసిన బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్