టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లలో రష్మిక మందన్న ఒకరు. కన్నడ సినిమా ‘కిరాక్ పార్టీ’ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తెలుగులో ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి హిట్ కావడంతో వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాలో నటించి దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ను పెంచుకుంది. ఈ మూవీతో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ బ్యూటీ నేషనల్ క్రష్ గా ఫేమ్ సంపాదించుకుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది రష్మిక. ఈ సందర్భంగా తన సినిమా కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. గతంలో తనకు సినిమా అవకాశం ఎలా వచ్చింది అని అడిగిన ప్రశ్నకు సో కాల్డ్ నిర్మాణ సంస్థ తనకు ఫోన్ చేసిందని చెప్పింది, అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ఇండస్ట్రీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చింది. క్రెడిట్ అంతా వాళ్లదే అంటూ పొగడ్తల వర్షం కురిపించింది.


ఇటీవల రష్మిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తనకు సినిమా అవకాశం ఎలా వచ్చిందో చెప్పింది. నిజానికి తాను ఒక యాక్టర్ ను అవుతానని ఎప్పుడూ అనుకోలేదని, కానీ సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేదని చెప్పింది. ఆ ఇంట్రస్ట్ తోనే కొన్ని సినిమా ఆడిషన్స్ కు వెళ్లేదాన్నిఅని చెప్పింది. అయితే ఒక్క సినిమాకు కూడా సెలెక్ట్ అవ్వలేదని పేర్కొంది. తర్వాత సినిమా ప్రయత్నాలు పక్కనపెట్టి ఓ అందాల పోటీలో పాల్గొని టైటిల్ సొంతం చేసుకున్నానని తెలిపింది. ఆ ఫోటో వివిధ వార్తా పత్రికల్లో వచ్చిందని, ఆ ఫోటో చూసి రక్షిత్ శెట్టికు సంబంధించిన పరంవా నిర్మాణ సంస్థ నుంచి కాల్ వచ్చిందని, అలా ‘కిరాక్ పార్టీ’ సినిమాకు ఛాన్స్ వచ్చిందని వివరించింది. 


అయితే గతంలో ఓ బాలీవుడ్ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో రష్మిక తన ఇండస్ట్రీ ఎంట్రీ గురించి చెప్తూ సో కాల్డ్ నిర్మాణ సంస్థ తనకు ఫోన్ చేసి సినిమా ఛాన్స్ ఆఫర్ చేశారని చెప్పింది. దీంతో ఆమెపై ట్రోల్స్ మొదలైయ్యాయి. సినిమా ఛాన్స్ ఇచ్చిన సంస్థనే మర్చిపోయావా అంటూ ఫైర్ అయ్యారు నెటిజన్స్. ఈ విమర్శలు చాలా రోజులు కొనసాగాయి కూడా. ఇండస్ట్రీ నుంచి కూడా కాస్త నెగిటివిటీ వచ్చిందని టాక్. అయితే రష్మిక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా కెరీర్ మొదటి ఆఫర్ గురించి మాట్లాడుతూ ఆ క్రెడిట్ అంతా రక్షిత్ శెట్టికు ఇవ్వడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. ఆమె ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఈ మూవీ తో పాటు ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వం వహిస్తోన్న ‘యానిమల్’స సినిమాలో నటిస్తోంది. ఈ మూవీలో రణ్ బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.


Read Also: ఇండస్ట్రీలో నానికి పోటీనిచ్చే హీరో లేడట! ‘దసరా’ బాగా తీయలేదంటూ నేచురల్ స్టార్ వ్యాఖ్యలు