Radhika Sarathkumar Tweet Viral: రాధిక శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించిన ఆమె ప్రస్తుతం అతిథి పాత్రలు, కీ రోల్స్ చేస్తున్నారు. మరోవైపు నిర్మాతగానూ రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే రాధిక ఫైర్ బ్రండ్ అనే విషయం తెలిసిందే. సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ తన గొంతు వినిపిస్తుంటారు. నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటారు. ముఖ్యంగా మహిళలపై జరిగే అఘాత్యాలు, అనుచిత సంఘటనలపై ఎప్పుడు తన గళం విప్పితుంటారు. మరోవైపు రాజకీయాల్లోనూ పరోక్షంగా యాక్టివ్‌గా ఉంటున్నారు. నటిగా, నిర్మాతగా, సామాజిక కార్యకర్తగా, పొలిటిషియన్‌గా.. అలౌ రౌండర్ అనిపించుకుంటున్న రాధిక తాజాగా ఓ సినిమాపై అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్ వదిలారు. అయితే, ఆ మూవీ పేరు చెప్పకుండానే సస్పెన్స్‌లో పెట్టారు ఆమె.
'మూవీని ఎత్తిపడేయాలన్నంత విరక్తి వచ్చింది'
దీంతో రాధిక పోస్ట్ ప్రస్తుతంగా హాట్‌టాపిక్ అయ్యింది. ఆమె ఏ మూవీ గురించి మాట్లాడారో అర్థం కాగా నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. ఇంతకీ రాధిక తన పోస్ట్‌లో ఏమన్నదంటే.. "మీరెవరైనా ఆ సినిమా చూసి విసుగు చెందారా? నాకు అయితే మూవీ చూస్తున్నంతసేపు చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఆ మూవీని ఎత్తిపడేయాలన్నంత విరక్తి కలిగింది" అంటూ యాగ్రీ ఎమోజీలను జత చేశారు. దీంతో రాధికకి అంతగా కోపం తెప్పించిన ఆ మూవీ ఏంటబ్బా అని అంతా ఆలోచనలో పడిపోయారు. 'అది ఏ సినిమానో చెప్పకుండ ఇలా సస్పెన్స్‌లో పెడితే ఎలా మేడం' అంటూ ఆమె పోస్ట్‌పై కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం అదేంటో ఏంటో ఆరా తీసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో రాధికకు విరక్తి కలిగించిన ఆ మూవీ 'యానిమల్' అయ్యి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
'యానిమల్' అయ్యింటుందా?
ఎందుకంటే రీసెంట్‌గానే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై కొందరు పోల్ కూడా పెడుతున్నారు. యానిమల్ లేదా సలార్ ఏదనుకుంటున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరెమో 'వీరసింహారెడ్డి'లో ఆమె కూతురు వరలక్ష్మి యాక్షన్ చూసి అంటున్నారామో అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. కానీ చాలావరకు మాత్రం రాధికను ఇబ్బంది పెట్టింది యానిమల్ అయ్యి ఉంటుందని సందేహిస్తున్నారు. మరి ఆ మూవీ ఏదో మీరైనా గెస్ చేయండి. కాగా 'అర్జున్ రెడ్డి' ఫేం సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ - నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించారు. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో.. అదే స్థాయిలో వ్యతిరేకత కూడా వచ్చింది.
Also Read: మా నాన్న అలా ఉంటే ‘లాల్ సలామ్’ చేసేవారే కాదు - కూతురి మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న రజనీకాంత్
సినిమాలో మహిళలకి ఏమాత్రం విలువ ఇవ్వలేదంటూ మహిళ మండలాలు, పలు సామాజీక సంఘాలు మండిపడ్డాయి. ఇక రణ్‌బీర్ బోల్డ్ యాక్టింగ్‌కి కూడా కొంతమంది నుంచి విమర్శలు వచ్చాయి. అయినా ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డుకు ఎక్కింది. ఇక సాధారణంగానే ఫేమినిస్ట్ అయినా రాధిక ఈ మూవీపై మండిపడిందంటున్నారు. ఇందులో మహిళలను కొన్ని చోట్ల తక్కువ చేసి చూపించాడాన్నే ఆమె సహించలేకపోయిందని, అందుకే అలా రియాక్ట్ అయ్యి ఉంటుందంటున్నారు. మరి దినిపై రాధిక ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి!