Actress Pragathi Reaction About Trollings On Her Gym Practices With Saree : టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి ఓ వైపు నటనలోనూ, మరోవైపు పవర్ లిఫ్టింగ్‌లోనూ ప్రతిభ చూపుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే టర్కీలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌తో పాటు 4 పతకాలు సాధించారు. తాజాగా ఆమె తనపై వస్తోన్న ట్రోలింగ్స్, జిమ్‌లో చీర కట్టుకుని ఎక్సర్‌సైజ్ చేసిన దానిపై వస్తోన్న కామెంట్లపై రియాక్ట్ అయ్యారు.
తుదిశ్వాస వరకూ సినిమానే...
తాను మీడియాకు దూరంగా ఉంటానని... ఈవెంట్లలోనూ మాట్లాడాలంటే భయమని అన్నారు ప్రగతి. మాట్లాడిన తర్వాత రోజు నుంచే ట్రోలింగ్‌కు గురవుతాననే ఆందోళన ఉంటుందని చెప్పారు. 'మూవీస్ మానేసి పవర్ లిఫ్టింగ్ చేస్తుందని అంతా అంటున్నారు. నేను సినిమా లేకుంటే బతకలేను. నా తుదిశ్వాస వరకూ నేను యాక్టింగ్ చేస్తూనే ఉంటాను. కాస్త గ్యాప్ ఇచ్చాను అంతే. తర్వాత మూవీలో విలన్‌గా చేస్తున్నా.
ఆ గ్యాప్‌లో ఎక్కడైనా తగ్గుతానేమోనని ఆ ఎనర్జీని పవర్ లిఫ్టింగ్‌కు టర్న్ చేశాను. ఈ రోజు మన దేశ జెండా వేసుకుని సిల్వర్ మెడల్ ఇంటికి తెచ్చాను. ' అని చెప్పారు.
Also Read : అఖండ 2 రిలీజ్ టీజర్... త్రిశూలం పట్టిన శివునిలా బాలయ్య - దిష్టి తీసే షాట్ సూపరంతే
ట్రోలింగ్స్‌కు ఇదే నా ఆన్సర్
పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు నీకు 'ఈ వయసులో అవసరమా?' అంటూ చాలామంది కామెంట్స్ చేశారని ప్రగతి తెలిపారు. 'జిమ్‌కు జిమ్ డ్రెస్సే వేసుకోవాలి. చీరలు, చుడీదార్స్ వేసుకోలేం. ఇంత అసహ్యంగా ఫీల్ చేస్తున్నారే? నేనేమైనా తప్పు చేస్తున్నానా? అనే ఫీలింగ్ నాకు కలిగింది. స్టార్టింగ్‌లో ట్రోలింగ్స్ వల్ల చాలా బాధ పడ్డా. ఆ కామెంట్స్, ట్రోలింగ్స్‌కు ఈ రోజు ఆన్సర్ వచ్చిందనే అనుకుంటా. ఏషియన్ గేమ్స్‌లో నాకు వచ్చిన మెడల్‌ను ఇండస్ట్రీలో ప్రతీ మహిళా ఆర్టిస్టుకు డెడికేట్ చేస్తున్నా.
సోషల్ మీడియాలో ఎలాంటి ఆలోచన లేకుండానే కామెంట్స్ చేసేస్తుంటారు. మనింట్లోనూ ఆడపిల్లలు ఉన్నారు. అది ఒకటి అందరూ ఆలోచించుకోవాలి. సినిమాలో నేను భాగం అయినందుకు చాలా గర్వపడుతున్నా. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ఓ మహిళా ఆర్టిస్ట్ ఎంత కష్టపడతారో నాకు తెలుసు. ఎవరికి ఏమీ ఇవ్వకపోయినా కొంచెం మర్యాద ఇవ్వండి. ఆర్టిస్టులకు రెస్పెక్ట్ ఇవ్వండి.' అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యారు.
వారిద్దరూ విష్ చేశారు
ఈ మెడల్ సాధించినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఇద్దరు వ్యక్తులు తనకు విష్ చేశారని చెప్పారు ప్రగతి. 'మంచు లక్ష్మి, బ్రహ్మానందం ఇద్దరూ నాకు విష్ చేశారు. నేను యాక్ట్ చేయని హీరో, హీరోయిన్ లేరు. నేను వర్క్ చేయని పెద్ద పెద్ద డైరెక్టర్స్ లేరు. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్‌కు కూడా చేశాను. నేను ఓ చిన్న యాక్టర్. SKN, మారుతి గారితో వర్క్ చేయలేదు. ఈ రోజు నన్ను పిలిచి సన్మానించినందుకు వారికి ధన్యవాదాలు. నేను ఏదో సాధించాను అనే ఓ గుర్తింపు నాకు ఇచ్చారు. నాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్.' అని చెప్పారు.