విడుదలకు ఒకట్రెండు రోజుల ముందు కాదు... ఏకంగా నెల ముందు 'ది రాజా సాబ్' (The Raja Saab Movie) అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యాయి. అయితే ఈ మూవీ టికెట్స్ ఎక్కడ ఓపెన్ అయ్యాయో తెలుసా?
అమెరికాలో నెల రోజుల ముందు!ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న హారర్ ఎంటర్‌టైనర్ 'ది రాజా సాబ్'. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. రిలీజుకు నెల ముందు నార్త్ అమెరికా ఏరియాలో సినిమా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యాయి. దీన్ని బట్టి చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్లానింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పుకార్లకు చెక్ పెట్టిన ప్రభాస్ టీమ్!నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టడం ద్వారా 'ది రాజా సాబ్' విడుదల మీద వస్తున్న పుకార్లకు ఒక విధంగా మూవీ టీమ్ చెక్ పెట్టిందని చెప్పవచ్చు. సంక్రాంతి బరిలో సినిమా విడుదల అయ్యే అవకాశాలు తక్కువ అని కొన్ని రోజుల నుంచి పుకార్లు షికారు చేస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ వాటిని ఖండించారు కూడా! ఇటీవల డిసెంబర్ 5 నుంచి 'అఖండ 2 తాండవం' వాయిదా పడినప్పుడు సైతం తమ 'ది రాజా సాబ్' వాయిదా పడే ప్రసక్తి లేదని చెప్పారు. ఇప్పుడు మరోసారి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసి పుకార్లకు చెక్ పెట్టారు.
ప్రభాస్ సరసన ముగ్గురు అమ్మాయిలు!హారర్ కామెడీలో 'ప్రేమ కథా చిత్రమ్' వంటి హిట్ తీసిన ఘనత దర్శకుడు మారుతి సొంతం. ఇప్పుడు మరోసారి ఆయన ఈ జానర్ టచ్ చేస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్... సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు అందాల భామలు నటించారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, బ్రహ్మానందం, 'వెన్నెల' కిశోర్, సప్తగిరి, వీటీవీ గణేష్, సత్య, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు.