Actress Meena About Heros and Cinema Career: హీరోయిన్ మీనా. ఎన్నో క్యూట్ క్యూట్ క్యారెక్ట‌ర్లు చేశారు. 'సీతారామ‌య్య గారి మ‌న‌వ‌రాలి'గా, 'చంటి'లో ఐదుగురు అన్న‌ల‌కు చెల్లెలిగా, 'సుంద‌ర‌కాండ‌'లో అమాయ‌కురాలిగా చెప్పుకుంటూ పోతే ఎన్నో క్యారెక్ట‌ర్లు ఉన్నాయి. చెల్లిగా, భార్యగా, మ‌న‌వ‌రాలిగా క్యారెక్ట‌ర్ ఏదైనా ఒదిగిపోయారు ఆమె. ఎన్నో హిట్ సినిమాలు చేశారు. ఇప్ప‌టికీ అల‌రిస్తూనే ఉన్నారు. ఇటీవల మీనా ఇచ్చిన ఇంట‌ర్వ్యూ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. దాంట్లో ఆమె ఎన్నో విష‌యాలు పంచుకున్నారు. 


'న‌ర‌సింహా'లో ఛాన్స్ అందుకే పోయింది.. 


'న‌ర‌సింహా' సినిమా ఎంత హిట్ అయ్యిందో తెలిసిన విష‌యమే. దాంట్లో ర‌మ్య‌కృష్ణ పాత్ర వేరె లెవెల్ అంతే. అయితే, అస‌లు ఆ పాత్ర మీనా చేయాల్సిందంట‌. కానీ, మిస్ అయ్యింద‌ని చెప్పారు ఆమె. "నీలాంబ‌రి పాత్ర నేను చేయాల్సింది. కానీ, అమ్మ నువ్వు చేయ‌గ‌ల‌వా? అని అన్నారు. కార‌ణం అప్ప‌టికే నేను ర‌జ‌నీకాంత్ గారితో హీరోయిన్ గా చేశాను. అంత ఇంటెన్స్ గా చేయ‌లేనేమో అని ఆమె ఉద్దేశం. అమ్మ అలా అనేస‌రికి డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు కూడా అవునా! అని ఆలోచ‌న‌లో ప‌డ్డారు. సౌంద‌ర్య క్యారెక్ట‌ర్ చేయ‌మ‌న్నారు. నేను చేయ‌ను అన్నాను. అలా ఆ క్యారెక్ట‌ర్ మిస్ అయ్యింది. నిజానికి ర‌మ్య‌కృష్ణ అద్భుతంగా చేశారు" అని చెప్పుకొచ్చారు మీనా.    


బాల‌కృష్ణ మాట్లాడుతూనే ఉంటారు... 


మీనా టాలీవుడ్ లో ఎంతోమందితో క‌లిసి న‌టించారు. ఆ హీరోల్లో ఎవ‌రితో వైబ్ ఎక్కువ‌గా ఉంటుంది? అని అడిగిన ప్ర‌శ్న‌కి ఆమె ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పారు. "వెంక‌టేశ్ గారితో ఎక్కువ‌గా ఉండేది. ఆయ‌న‌తో మంచి ర్యాపో ఉంది. నిజానికి నేను అప్పుడే కొత్త‌గా వ‌చ్చాను. ఎవ్వ‌రితో మాట్లాడే దాన్ని కాదు. హీరోలంతా అప్ప‌టికే సూప‌ర్ స్టార్స్. అందుకే ఎవ్వ‌రితో మాట్లాడే దాన్ని కాదు. కానీ, బాల‌య్య గారు మాత్రం అలాకాదు. మాట్లాడుతూనే ఉంటారు. నేను మాట్లాడ‌క‌పోయినా క‌దిలించి మాట్లాడ‌తారు. చిరంజీవి గారు, వెంకీ గారు, నాగార్జున గారు సైలెంట్, నేను సైలెంట్. అలా ఎవ్వ‌రితో పెద్ద‌గా మాట్లాడే దాన్ని కాదు. ఇక రెండు మూడు సినిమాల వ‌ర‌కు త‌ర్వాత‌.. మాట్లాడ‌టం మొద‌లుపెట్టాను. అలా ఫ్యామిలీస్ తో కూడా ద‌గ్గ‌ర‌య్యాను" అని చెప్పారు మీనా. 


మోహ‌న్ బాబు గారు డిఫ‌రెంట్..  


"అంద‌రిలోక‌ల్లా మోహ‌న్ బాబు గారు చాలా డిఫ‌రెంట్. బెదిరించిన‌ట్లు ఉండేది ఆయ‌న మాట తీరు. అల్ల‌రి మొగుడు చేసేట‌ప్పుడు నేను చాలా చిన్న‌దాన్ని క‌దా. నా బుగ్గ‌లు గిల్లేవాడు. అప్ప‌ట్లో కామెడీగా మాట్లాడుతున్నాడు అని కూడా తెలియ‌ని అమాయ‌క‌త్వం నాది. తెలుగు అప్పుడే నేర్చుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు? ఎవ‌రి గురించి మాట్లాడుకుంటున్నారో తెలీదు. ఆ త‌ర్వాత తెలిసేది నా గురించి అని. ఆయ‌న వ‌స్తారు.. రేయ్ రారా పోరా అంటూ కేక‌లు వేస్తారు. త‌మిళ్ లో తెలుగులో ఆయ‌న లాంటి వాళ్ల‌ని చూడ‌లేదు. అస‌లే నేను మాట్లాడ‌ను, ఆయ‌న‌తో అస‌లే మాట్లాడ‌ను. కానీ, నేను వాళ్ల ఫ్యామిలీకి క్లోజ్. ల‌క్ష్మీ, విష్ణుతో ఆడుకునేదాన్ని. త‌ర్వాత ఆయ‌న గురించి తెలిసింది. చాలా మంచి వ్య‌క్తి. అంద‌రినీ క‌లుపుకుని పోయే వ్య‌క్తి అని తెలుసుకోవ‌డానికి టైం ప‌ట్టింది. ఇప్పుడు నేను అంద‌రికి ఫ్రెండ్స్. నేను చాలా ప్రొఫెష‌నల్ గా ఉంటాను" అదే నాకు అసెట్ అని త‌న షూటింగ్ జ్ఞాప‌కాల‌ను పంచుకున్నారు మీనా. 


Also Read: ‘ఔను, నేను రిలేష‌న్ షిప్‌లో ఉన్నా’ అంటూనే ట్విస్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ